Jagga Reddy: మిస్టర్ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ను విమర్శిస్తే ఊరుకోం, నువ్వు అడవిలో తుపాకి పడితే, నేను జనంలో గన్ పట్టినా అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల భూతులతో విమర్శిస్తున్నాడని, తాను కూడా భూతులతోనే సమాధానం ఇస్తానని మండిపడ్డారు. సైకోలా వ్యవహరించవద్దని సూచించారు. సీఎం సౌమ్యంగా వ్యవహరిస్తున్నారని, కానీ తన స్టైల్ అలా ఉండదని హెచ్చరించారు.
Also Read: Adi Srinivas: ఈటెలకు మతిపోయింది.. పిచ్చివాగుడు కట్టిపెట్టాలి.. ప్రభుత్వ విప్ ఫైర్!
సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే నడిరోడ్డులో బట్టలు విప్పి గుంజీలు తీయిస్తానని నొక్కి చెప్పారు. నల్లి కుంట్ల రాజకీయాలు బంద్ పెట్టుకోవాలని కోరారు. సీఎంను తిడితే పదవి వస్తుందని భ్రమ పడవద్దని వెల్లడించారు. సీనియర్ నాయకుడు, ఎంపీగా పనిచేస్తున్న వ్యక్తి దిగజారే రాజకీయాలు చేయవచ్చా? అంటూ నిలదీశారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.