Jagadish Reddy: నీళ్లశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)కి జ్ఞానం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉత్తమ్ కు నీళ్లు అంటే భయం.. ఇరిగేషన్ సబ్జెక్టు అంటే భయం అని, ఆయన ఎవరో ఒకరు రాసిస్తే మాట్లాడతారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), నల్గొండ జిల్లా మంత్రులు ఎస్ఎల్బీసీ (SLBC)పై సర్వే చేశారని, రాజకీయ నాయకులు టెక్నికల్ సర్వే చేయడం మొదటిసారి అన్నారు. కెప్టెన్ హెలికాప్టర్ నడిపించారు. వాటర్‌లో నీళ్లు కలిపే మంత్రి సర్వే చేశారు అని దుయ్యబట్టారు.
అవగాహన లేకుండా మంత్రులు
ఎస్.ఎల్.బీ.సీ విషయంలో ద్రోహం చేసిందే కాంగ్రెస్(Congress),టీడీపీ(TDP)లు అని మండిపడ్డారు. వారి పాలనలోనే తెలంగాణ(Telangana)కు తీవ్ర నష్టం జరిగిందన్నారు. దత్తత పేరుతో సమైక్య పాలకులు కోతలు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 లో ఉమ్మడి ఏపీలో క్రిష్ణా నది జలాల కేటాయింపులు జరిగాయని, తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు కేటాయించారన్నారు. అవగాహన లేకుండా కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్(KCR) సీఎం అయ్యాక క్రిష్ణా జలాల వాటా కోసం కమీషన్ వేయించారన్నారు. ఎస్ఎల్బీసీ లో శవాలను బయటకు తీయలేని వాళ్ళు మాట్లాడటం హేయనీయమన్నారు. సర్వే చేయకుండా కమీషన్ల కోసం ఎస్ఎల్బీసీ పనులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Plastic Containers: ప్లాస్టిక్ కంటైనర్లలో ఫుడ్ వేడి చేస్తున్నారా? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే?
నీళ్లను గురుదక్షిణ కింద..
నల్గొండ జిల్లాలో ఇద్దరు మొనగాళ్ళు మంత్రులుగా ఉన్నారు. ఉదయసముద్రం ప్రాజెక్టుల్లో నీళ్లు కూడా తేలేదని ఇది వారి సమర్ధత అని దుయ్యబట్టారు. కృష్ణా నది(Krishna River)లో 500 టీఎంసీలు తెలంగాణకు తేకుండా రెండు ఏళ్ళుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లను గురుదక్షిణ కింద చంద్రబాబు(Chandrababu)కు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని నిలదీశారు. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ గురించి మాట్లాడేఅర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. రేవంత్ రెడ్డి పాత గురువు చంద్రబాబు, కొత్త గురువు కాంగ్రెస్ నిర్వాకంతోనే పాలమూరుకు నీళ్లు రాలేదన్నారు. ఎస్ఎల్బీసీ ని కమీషన్ల కోసమే కాంగ్రెస్ మొదలుపెట్టిందని అన్నారు. మంత్రులు కమిషన్లకు అలవాటుపడ్డారని దుయ్యబట్టారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్య గౌడ్, భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.
Also Read: Pushpitha Laya: పని చేతకాని ప్రజాప్రతినిధులను చీరే సారే పంపిస్తాం: ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ
