International Yoga Day(imagecredit:twitter)
తెలంగాణ

International Yoga Day: అంతర్జాతీయ యోగా డే.. గచ్చిబౌలిలో సర్కార్ వేడుకలు

International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవ (International YogaDay) వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌళిలోని‌ జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,(Governor Jishnu Dev Varma) సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఇతర మంత్రులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రెటీలు పాల్గొననున్నారు. సుమారు 5 వేల మందితో నిర్విహించనున్న ఈ కార్యక్రమానికి ఆయుష్, ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఉదయం 6 గంటలకు యోగా సెషన్ ప్రారంభం కానుంది. ఈ సెషన్‌లో గవర్నర్, సీఎం, మంత్రులు, సెలబ్రెటీలు యోగా చేయనున్నారు. ఇక రాష్ట్రంలో యోగా(Yoga) ను ప్రతి ఇంటికీ చేరువ చేసే ఉద్దేశ్యంతో గతేడాది ప్రభుత్వం 628 మంది యోగా గురువులను నియమించింది. ఈ ఏడాది మరో 250 మందికిపైగా యోగా గురువుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో(సబ్‌ సెంటర్లు) ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకూ యోగా క్లాసులు నిర్వహిస్తున్నారు.

Also Read: Uttar Pradesh News: ప్రియుడి కోసం వెళ్లిన భార్య.. వెంటాడి ముక్కు కొరికేసిన భర్త.. ఎక్కడంటే?

కొత్తగా నియమితులైన యోగా గురువులు కొత్తగా 5 లక్షల మందికి యోగా నేర్పించారని ఆయుష్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. గర్భిణులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పేషెంట్లకు ప్రత్యేక యోగా తరగతులను నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

 

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు