Swetcha-investigation
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

BRS BJP talks: బెడిసిన గులాబీ వ్యూహం… బీజేపీ నేతలతో ఇద్దరు కీలక నేతల భేటీ?

BRS BJP talks: కమలం పార్టీ నేతలతో ఇద్దరు బీఆర్ఎస్ కీలక నేతల భేటీ?

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లోపాయికారి సహకారం ఇవ్వాలని విజ్ఞప్తి!
ఓ మాజీ బీజేపీ అధ్యక్షుడు ససేమిరా
ఈ భేటీ విషయంపై కేసీఆర్ ఆగ్రహం!
సంప్రదింపులు ఎవరిని అడిగి చేశారంటూ మండిపాటు
ఉప ఎన్నికల్లో ఓడితే బీఆర్ఎస్‌కు నష్టమనే భావన
ఇప్పటికే కంటోన్మెంట్ ఓటమితో గ్రేటర్ కేడర్‌లో నైరాశ్యం
భవిష్యత్‌లో బీజేపీతో బీఆర్ఎస్ కలిసే ముందుకు?

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్: గులాబీ వ్యూహం బెడిసికొట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పరోక్ష సహకారం అందజేయాలని బీఆర్ఎస్ కోరగా.. బీజేపీకి చెందిన కొందరు ఓకే చెప్పినా (BRS BJP talks), మరో కీలక నేత వ్యతిరేకించినట్లు సమాచారం. అంతేకాదు ఈ విషయం గులాబీ అధినేతకు తెలియడంతో ఈ ఇద్దరు కీలక నేతలపై సీరియస్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. అసలు ఎందుకు సహకారం కోరారని, సొంత నిర్ణయాలు ఏమిటని నిలదీసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే పార్టీలో వీరి సొంత నిర్ణయాలు సైతం ఇప్పటికే చర్చనీయంగా మారాయి.

బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారింది. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. లేకుంటే గ్రేటర్‌లో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ప్రభావం పడే అవకాశం ఉంది. పార్టీ సైతం పట్టుకోల్పోయే అవకాశం ఉంది. ఓడితే మాత్రం గడ్డుపరిస్థితి ఎదురవుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ప్రభావం పడుతుందని, ఎలాగైనా గెలిచి తీరాలని గులాబీ పార్టీలోని ఈ ఇద్దరు కీలక నేతలైన మాజీ మంత్రులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు ఆలస్యంగా సమాచారం లీక్ అయింది. ఫేస్ కాల్ మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో కీలకంగా ఉన్న నేతతో సంప్రదింపులు జరినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి డమ్మి అభ్యర్థిని బరిలో నిలిపి తమకు పరోక్షంగా సహకారం అందించాలని కోరినట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, భవిష్యత్‌లో సహకారం అందజేస్తామని ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఉప ఎన్నికలకు సహకరించాలని విజ్ఞప్తి చేయగా అందుకు బీజేపీలోని ఇద్దరు కీలకనేతలు సైతం ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఒకరు మాత్రం ససేమిరా అన్నట్లు సమాచారం. బీజేపీ నుంచి ఎలాంటి పరోక్ష సహకారం అందించబోమని, పోటీ చేస్తామని తేల్చిచెప్పినట్లు సమాచారం.

బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీతను ఉప ఎన్నికల్లో బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. అయితే ఆమె గతంలో పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేయలేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. మాగంటి గోపీనాథ్‌పై నియోజకవర్గ ప్రజల్లో ఆదరణ తప్ప అభ్యర్థి సునీతకు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం కష్టం కావడంతోనే ఆ ప్రభావం పార్టీపై పడకుండా ఎలాగైనా జూబ్లిహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. ఈ ఉప ఎన్నికల్లో ఓడితే, కాంగ్రెస్ గెలిస్తే రాబోయే ఎన్నికలకు సైతం మళ్లీ నియోజకవర్గంలో పట్టుసాధించలేమని గులాబీ నేతల్లో ఆందోళన, భయం మొదలైంది. విజయం సాధించాలంటే బీజేపీ అభ్యర్థి డమ్మి అయితేనే సాధ్యమని భావించి బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు ఇద్దరు బీజేపీతో సంప్రదింపులు చేసినట్లు సమాచారం. సునీత ప్రకటన కంటే ముందే ముస్లీంను క్యాండేట్ ను పెట్టుకుంటామని సహకరించాలి బీజేపీ నేతలను కోరినట్లు సమాచారం.

కేసీఆర్ సీరియస్?

బీజేపీతో గులాబీ కీలక నేతలు సంప్రదింపుల విషయం పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి రాగానే వారిని మందలించినట్లు సమాచారం. ఎందుకు సంప్రదింపులు చేశారు.. ఎవరి అడిగి చేశారు.. చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.. సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకొంటున్నారని సీరియస్ అయినట్లు సమాచారం. పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారని గట్టిగా నిలదీసినట్లు సమాచారం. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టండి.. జూబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేయండి.. కమిటీలతో పాటు విస్తృతంగా ప్రచారం చేయండి.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపండి.. అంతేకానీ బీజేపీ నేతలతో సంప్రదింపులు ఏంటని నిలదీసినట్లు సమాచారం. దీంతో ఆ నేతల దూకుడుకు కళ్లెం వేసినట్లయింది.

Read Also- Modi Manipur visit: జోరు వానలో హెలికాప్టర్ వద్దన్న భద్రతా సిబ్బంది.. మోదీ డేరింగ్ నిర్ణయం!

గత పార్లమెంట్ లో మైత్రి అని ప్రచారం?

బీఆర్ఎస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో 17 సెగ్మెంట్లలో ఒక్కదాంట్లో సైతం విజయం సాధించలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా మూడోస్థానికి చేరింది. మెదక్ లో సైతం రెండోస్థానానికి బీఆర్ఎస్ పడిపోవడంతో అప్పుడంతా బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా సహకరించిందని, పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఒక్క ఒక్క సీటు గెలుచుకోకపోవడానికి కారణం అదే అనే ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ సహకారంతోనే బీజేపీ 8 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుందనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీలోని ఇద్దరు కీలక నేతలు పేస్ కాల్ తో తమకు లోపాయికారిగా సహకరించాలని బీజేపీ నేతలను కోరడమంటే రాబోయే కాలంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోతాయా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తాయా? ఇప్పుడు సంప్రదింపులతో అదే సంకేతం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఆ రెండుపార్టీలు ఒకటి అవుతాయని ఇప్పటికే హస్తం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ మైత్రి కొనసాగుతుందని, ఈ రెండు పార్టీలు ఒకటేనని మొదటి నుంచి ఆరోపనలు చేస్తున్నారు. ప్రస్తుత సంప్రదింపులతో కాంగ్రెస్ నేతల వాదనలు కరెక్టేనని స్పష్టమవుతుంది.

కంటోన్మెంట్ ఎన్నికలతో కేడర్ లో మరింత నైరాశ్యం

కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. సిట్టింగ్ స్థానంను కోల్పోవడంతో కేడర్ లో సైతం నైరాశ్యం నెలకొంది. కొంతమంది టికెట్ ఆశించిన భంగపడ్డ నేతలు సైతం పార్టీపై అసంతృప్తితోనే ఉన్నారు. ఆ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు సైతం స్తంభించిపోయాయని ఆ నియోజకవర్గ నేతలే అభిప్రాయపడుతున్నారు. పార్టీ అనుసరిస్తున్న తీరిపై ఆగ్రహంతో ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తిరిగి గ్రేటర్ లోని గులాబీ కేడర్ లో జోష్ నింపాలని అధిష్టానం భావిస్తుంది. అయితే విజయం సాధిస్తుందా? లేదా? అనేది హాట్ టాపిక్ అయింది.

Read also- Telangana Govt: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్… మండలానికో సెంట్రింగ్ యూనిట్!

Just In

01

Mirai Movie: ‘మిరాయ్’ మూవీని తిరస్కరించిన హీరో ఎవరో తెలుసా?

Charan and Upasana: రామ్ చరణ్, ఉపాసన దంపతులు చెప్పబోయే గుడ్ న్యూస్ ఇదేనా?

TG Vishwa Prasad: రజినీకాంత్ ‘అరుణాచలం’ టైప్ కాదు.. నాకు డబ్బు విలువ తెలుసు!

BRS BJP talks: బెడిసిన గులాబీ వ్యూహం… బీజేపీ నేతలతో ఇద్దరు కీలక నేతల భేటీ?

Manchu Manoj: ముందు అక్క సినిమా వస్తోంది.. తర్వాత ‘ఓజీ’.. మూవీ లవర్స్‌కు ఫీస్ట్!