India on Pakistanis: కాశ్మీర్ లోయలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన అనంతరం భారత్, మరియు పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ రెండు దేశాలు యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా భారత్ ప్రతీకార దాడి చేసేందుకు అదును కోసం ఎదురుచూస్తోంది. దీంతో పాకిస్థాన్ పాలకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అదేసమయంలో దేశ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్‌లో ఉంటున్న పాకిస్థాన్ జాతీయుల వీసాలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీరందరు నిర్ధేశిత గడువులోగా దేశం విడిచి తమ స్వదేశానికి వెళ్ళిపోవాలని స్పష్టం చేసింది. పాక్ పౌరులు భారత్ విడిచి వెళ్లేందుకు ఏప్రిల్ 29వ తేదీ అర్థరాత్రి వరకు గడువు విధించింది. వైద్యం తదితర కారణాలతో మెడికల్ వీసాలపై ఇక్కడకు వచ్చిన వారికి సైతం ఇదే గడువు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
Also Read: Harish Rao – Kavitha: గులాబీ కమిటీలో చోటు దక్కేనా? పదవులపై హరీష్, కవిత మల్లగుల్లాలు!
గడువులోగా దేశం విడిచి వెళ్లని పక్షంలో వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీచేసింది. కనీసం మూడేళ్లపాటు జైలుశిక్ష విధించే అవకాశం కూడా ఉంటుదని పేర్కోంది. కేంద్ర ఆదేశాల మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పాకిస్థాన్ పౌరులు ఇప్పటికే స్వదేశానికి తిరుగుముఖం పట్టారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో నివసిస్తున్న పాక్ జాతీయులను గుర్తించి, వారిని గడువులోగా పంపించి వేసేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ అధికారులు నగరంలో నమోదైవున్న పాక్ పౌరుల వివరాలపై ప్రత్యేక దృష్టిసారించి పంపించి వేస్తున్నారు.
Also Read: Electricity In TG: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకి డౌన్ ఫాల్.. కారణం ఏమిటంటే!