Duvvuri Subbarao: హైదరాబాద్ దేశంలోనే ఐకాన్ గా మారుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు(Duvvuri Subbarao) తెలిపారు. మంగళవారం ఆయన గ్లోబల్ సమ్మిట్ లో మాట్లాడుతూ.. భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నఈ తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉన్నదన్నారు. తెలంగాణను రాబోయే ఇరవై ఏళ్లలో దేశంలోనే అభివృద్ది చెందిన రాష్ట్రంగా లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగడం గొప్ప విషయమన్నారు. తాను కూడా తెలంగాణలో పనిచేశానని, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత ఆర్థిక కార్యదర్శిగా పని చేశానని గుర్తు చేశారు. ఖమ్మం కలెక్టర్ గానూ వర్క్ చేశానని వివరించారు.
ఒకప్పుడు తెలంగాణలో పేదరికం
బహూశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు స్కూల్లో ఉండొచ్చని వెల్లడించారు. కానీ ప్రస్తుతం తాను హైదరాబాద్ వాడినని, తెలంగాణ రాష్ట్రం అని చెప్పేందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. ఒకప్పుడు తెలంగాణలో పేదరికం, వెనుకబాటుతనం తనం, అమాయకత్వంతో ఉండేదని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన మార్పులు వచ్చాయన్నారు. ప్రస్తుతం అభివృద్ది దిశలో పయనిస్తుందన్నారు. అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ నగరం ఒ అద్బుతమైన ఆణిముత్యమని, జాతీయ అంతర్జాతీయ నగరాలు తిరిగినా.. హైదరాబాద్ నగర ప్రత్యేకతే వేరన్నారు.
Also Read: Hydra Commissioner: సైదాబాద్ ఎర్రకుంటకు పూర్వ వైభవం తీసుకువస్తాం : హైడ్రా కమిషనర్ రంగనాధ్
నీతి అయోగ్ మేధావులచేత
20 ఏళ్ల క్రితం దేశ వ్యాప్త ప్రజలు బెంగళూరుకు వెళ్లేవారని, కానీ ఇప్పుడు అంతా కాస్మోపాలిటన్ కల్చర్(Cosmopolitan Culture) ఉన్న, ఐకానిక్ గా ఉన్న హైదరాబాద్ ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటూ ఇక్కడ ఇష్టంగా స్థిరపడుతున్నారన్నారు. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ను ఐఎస్ బీ(ISB), నీతి అయోగ్ ఇతర మేధావులచేత రూపొందించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి రాబోయే పదేళ్లలో 1ట్రిలియన్ డాలర్ ఇరవై రెండేళ్లలో స్వాతంత్ర్యం వచ్చి వందేళ్ల నాటికి 3ట్రిలియన్ డాలర్లు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.
Also Read: Saik Siddharth: నందు ‘సైక్ సిద్ధార్థ’ రిలీజ్ డేట్ వాయిదా.. వచ్చేది ఎప్పుడంటే?

