SIT on Betting Apps (imagecredit:canva)
తెలంగాణ

SIT on Betting Apps: బెట్టింగ్ భూతానికి చెక్.. రంగంలోకి సిట్.. కీలక ఆదేశాలు జారీ

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: SIT on Betting Apps: ఆన్​ లైన్​ బెట్టింగ్​ భూతాన్ని అంతం చేయటమే లక్ష్యంగా ఏర్పాటైన స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీం (సిట్​) కార్య రంగంలోకి దిగింది. సీఐడీ డీజీ శిఖా గోయల్​ నేతృత్వంలో సెట్​ సభ్యులు గురువారం డీజీపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఆన్​ లైన్​ బెట్టింగ్​ కేసుల్లో దర్యాప్తు జరుపుతున్న అధికారులు అందరితో త్వరలోనే స్టేట్​ పోలీస్​ హెడ్​ క్వార్టర్స్​ లో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

వీరి ద్వారా ఆయా కేసులకు సంబంధించిన వివరాలు, ఇప్పటివరకు జరిపిన విచారణలో వెల్లడైన వివరాలను తెప్పించుకోనున్నారు. వీటిపై సమీక్ష జరిపి విచారణాధికారులకు మార్గదర్శకాలను నిర్ధేశించనున్నారు. దాంతోపాటు ఆదాయపు పన్ను, జీఎస్టీ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్​, ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మినిస్ట్రీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖ, డిపార్ట్​ మెంట్​ ఆఫ్​ ప్రాసిక్యూషన్​ ప్రతినిధులతో కూడా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

Also Read: Attapur Crime: హైదరాబాద్‌లో దారుణం..తలపై రాళ్లతో కొట్టి.. బాలుడి హత్య

పదుల సంఖ్యలో ఆత్మహత్యలకు…వందల సంఖ్యలో కుటుంబాలు వీధులపాలు కావటానికి కారణమవుతున్న ఆన్​ లైన్​ బెట్టింగ్​ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సీరియస్​ గా స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆన్​ లైన్​ బెట్టింగ్​ భూతాన్ని అంతం చేయటానికి సిట్​ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. ఆ వెంటనే ప్రొవిజన్స్​ అండ్​ లాజిస్టిక్స్​ ఐజీ రమేశ్​ రెడ్డి, ఇంటెలిజెన్స్​ ఎస్పీ సింధు తులానీ, సీఐడీ ఎకనామిక్​ అఫెన్సెస్​ వింగ్​ ఎస్పీ వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్​, డీఎస్పీ శంకర్​ లతో సిట్​ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్​ ఉత్తర్వులు జారీ చేశారు.

సీఐడీ డీజీ శిఖా గోయల్​ పర్యవేక్షణలో సిట్​ పని చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సమావేశమైన సిట్​ సభ్యులు అక్రమంగా నడుస్తున్న బెట్టింగ్​ యాప్​ లు ఎన్ని ఉన్నాయి? లావాదేవీలను ఎలా నిర్వహిస్తున్నాయి? అన్న అంశాలపై విచారణ జరపాలని నిర్ణయించారు. అక్రమ బెట్టింగ్​ యాప్​ ల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయనున్నారు.

ఆన్​ లైన్​ బెట్టింగ్​ యాప్​ ల ప్రమోషన్ల అంశంపై కూడా సిట్​ దృష్టి సారించనుంది. ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని దీనికి అడ్డుకట్ట వేయటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా కసరత్తు చేయనుంది. 9‌‌0రోజుల్లో సమగ్ర నివేదికను తయారు చేసి డీజీపీకి అందచేయనుంది.

Also Read: Twist In Ameenpur case: ప్రియుడితో వెళ్లాల్సింది.. పిల్లలను పొట్టనబెట్టుకుంది.. అమీన్ పూర్ ఘటనపై భర్త చెన్నయ్య

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్