Ponnam Prabhakar ( IMAGE credit: twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Ponnam Prabhakar: దేశంలో పాస్ పోర్ట్ జారీలో.. తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచిందంటే?

Ponnam Prabhakar: పౌరులకు పాస్ పోర్ట్ లను జారీ చేసే ప్రక్రియలో మన రాష్ట్రం దేశంలోనే అయిదో స్థానంలో ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ రియాజుల్ హసన్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి లతో కలిసి మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా మెట్రో స్టేషన్ లో మొదటి పాస్ పోర్ట్ కేంద్రాన్ని ప్రారంభించుకున్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో దేశంలోనే 5 వ స్తానంలో ఉందని, తెలంగాణ లో 5 పాస్ పోర్ట్ కేంద్రాలుండగా, బేగంపేట ప్రధాన పాస్ పోర్ట్ కేంద్రంగా మొదటి స్థానంలో నిలిచిందని, ఎంజీబీఎస్, టీలిచౌకి, నిజామాబాద్, కరీంనగర్ లలో సెంటర్లున్నట్లు మంత్రి తెలిపారు.

 Also Read: Pending Bills: పెండింగ్ బిల్లులను వారంలో క్లీయర్ చేయాలి.. మంత్రి సీతక్కకు టీపీఎస్ఎఫ్ విజ్ఞప్తి

ఆధార్ కార్డు మాదిరి ప్రతి ఒక్కరు పాస్ పోర్ట్ తీసుకోవాలి

తెలంగాణలో రోజుకు 4500 పాస్ పోర్ట్ లు జారీ చేసే సామర్యం ఉందని తెలుపుతూ, 750 నుండి 1200 స్లాట్స్ సామర్థ్యం పెంచుకోవాలని సూచించారు. తాను ఎంపీగా ఉన్న కాలంలో కరీంనగర్ లో ప్రారంభించుకున్న పాస్ పోర్ట్ కేంద్రంలో అప్పట్లో కేవలం 250 స్లాట్స్ ఉండగా, ఇపుడు వాటిని 500 స్లాట్స్ పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆధార్ కార్డు మాదిరి ప్రతి ఒక్కరు పాస్ పోర్ట్ తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. గతంలో గల్ఫ్ దేశాలకు కార్మికుల మాదిరి విదేశాలకు వెళ్లేదని, ఇప్పుడు విద్యా, ఉపాధి అవకాశాలు నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారని ఆయన గుర్తు చేశారు. భారతీయుడిగా గుర్తింపు ఉండడానికి పాస్ పోర్ట్ అవసరమని, అందరు తీసుకోవాలన్నారు.

పాస్ పోర్ట్ వెరిఫికేషన్ లో పోలీస్ లు వేగవంతం

ఎంజీబీఎస్ లో పాస్ పోర్ట్ కేంద్రం అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇక్కడ మెట్రోరైలు, బస్ స్టేషన్ ద్వారా వివిధ జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి పాస్ పోర్ట్ తీసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని, ఇక్కడ మెట్రో బస్ సౌకర్యం ఉండడం వల్ల ఎక్కువ స్లాట్స్ బుక్ అయ్యే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. పాస్ పోర్ట్ కోసం వచ్చే వారి పట్ల సిబ్బంది మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, రాష్ట్రంలో ఎంజీబీఎస్ లోనే పాస్ పోర్ట్ తీసుకుంటామని, ప్రజలు ముందుకొచ్చేలా సిబ్బంది వ్యవహరించాలని మంత్రి సూచించారు. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ లో పోలీస్ లు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మనం అప్లై చేసుకోగానే వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేసుకుని పాస్ పోర్ట్ వచ్చేలా చర్యలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.

పాతబస్తీ ప్రాంతంలో పాస్ పోర్ట్ సేవా కేంద్రం

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి విద్యావంతులు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగుల కోసం అలాగే ఉపాధి అవకాశాల కోసం ఎందరో వెళ్లే సందర్భాల్లో బస్టాండ్, మెట్రో స్టేషన్ ఉండటం సులభతరంగా ఉందని వివరించారు. హైదరాబాద్ బేగంపేట్ లో 1976 నుంచి పాస్ పోర్ట్ కార్యాలయం ఉండటంతో కొంత ఇబ్బందులు ఉండేవన్నారు. హైదరాబాద్ మహానగరం పాస్ పోర్ట్ జారీలో దేశంలోనే ఐదవ స్థానంలో నిలిచిందని, తెలంగాణ పోలీస్ యంత్రాంగం పాస్ పోర్ట్ వెరిఫికేషన్ లో ముందుండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, కేంద్ర మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ కేజీ శ్రీనివాస, రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ జె. స్నేహజారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, డీపీఓ శ్రీనివాసరావు, ఇతర విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 Also Read: RTI Awareness: సమాచార హక్కు చట్టం పటిష్టంగా అమలు: కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి

Just In

01

Shreyas Iyer: అయ్యర్‌కు ఏమైంది?.. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఇండియా-ఏ టీమ్ నుంచి వైదొలగిన వైనం

Katrina Kaif: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. వైరల్ అవుతున్న బేబీ బంప్‌ ఫొటోలు

No Diwali Gifts: ప్రజాధనంతో ఉద్యోగులకు గిఫ్టులా? కేంద్రం కన్నెర్ర.. కీలక ఆదేశాలు

Medak District: మెదక్ జిల్లాలో ఘోర సంఘటన.. ఏడాదిన్నర దూడపై యువకుడి అఘాయిత్యం

H1B Exemption: హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు నుంచి వారికి మినహాయింపు.. సుముఖంగా ఉన్న ట్రంప్!