Pending Bills: పంచాయతీ కార్యదర్శులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్)ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. సచివాలయంలో మంగళవారం మంత్రి సీతక్క ( Seethakka) కు తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ ఫెడరేషన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీపీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల ఎఫెక్టివ్ డేట్ ను అన్ని జిల్లాలలో వెంటనే ఇస్తూ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అధికారులను ఆదేశించాలని, గ్రామ పంచాయతీలలో పెండింగ్లో ఉన్న బిల్లుల (Pending Bills) ను వారం రోజుల్లో బతుకమ్మ పండుగ లోపే క్లియర్ చేయాలి. )
Also Read: Team India Sponser: డ్రీమ్11 స్థానంలో కొత్త స్పాన్సర్ ఎంపిక.. ఏ కంపెనీయో తెలుసా?
ఇచ్చిన డిమాండ్లను అన్నింటిని పరిష్కరించాలి
తాగునీటి నిర్వహణకు ఓఅండ్ఎం పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేస్తామని, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగు సంవత్సరాల సర్వీస్ ను పరిగణలోకి తీసుకోవాలని, ఓపీఎస్, టీఓ, జేపీఎస్, స్పౌజ్ అంశాలతో సహా ఆత్మీయ సమ్మేళనంలో ఇచ్చిన డిమాండ్లను అన్నింటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి స్పందించి సర్వీసు సంబంధించిన ఫైల్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ బిల్లులను సిద్ధం చేయాలని, కార్యదర్శలు డిమాండ్స్ అన్నింటిని పరిష్కరించే విధంగా త్వరగా ఫైలు సిద్ధం చేయాలని అన్నారు. సమస్యలపై స్పందించిన మంత్రికి పంచాయతీ కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, గౌరవాధ్యక్షుడు సందీప్, కోశాధికారి ముత్యాల శశిధర్ గౌడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గౌతం, సభ్యులు శైలేష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు హరికృష్ణ పాల్గొన్నారు.
Also Read: Dornakal Politics: డోర్నకల్‌లో రగులుతున్న రాజకీయం.. స్ధానిక పట్టుకోసం విశ్వ ప్రయత్నాలు