GHMC Property Tax (imagrcredit:twitter)
తెలంగాణ

GHMC Property Tax: జీహెచ్ఎంసీపై కలెక్షన్ల జల్లు.. ఏరియాల వారీగా వసూళ్లు ఇవే?

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: GHMC Property Tax: రాష్ట్రంలో అత్యధిక జనాభాకు తగిన విధంగా అభివృద్ది పనులతో పాటు అత్యవసర సేవలనందించే జీహెచ్ఎంసీ గత ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి రూ.2038.42 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ను కలెక్షన్ చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో మార్చి నెలాఖరుకల్లా సుమారు రూ.1917 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్న జీహెచ్ఎంసీ ఇటీవలే ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024-25)లో కనీసం అదనంగా ఒక్క కోటి రూపాయల ట్యాక్స్ అదనంగా కలెక్షన్ చేయాలన్న లక్ష్యంతో వ్యూహాం తయారు చేసుకోగా అధికారుల అంచనాలను తారుమారు చేస్తూ, ఎవరూ ఊహించని విధంగా రూ.2038.42 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అయింది. ఇది గత ఆర్థిక సంవత్సరం 2023-24తో పోల్చితే సుమారు రూ.121 కోట్లు అధికంగా కలెక్షన్ చేసుకుంది.

ఇందుకు కమిషనర్ ఇలంబర్తి నిరంతర సమీక్ష, అదనపు కమిషనర్, రెవెన్యూ జాయింట్ కమిషనర్ మహేశ్ కులకర్ణి ఫీల్డు లెవెల్ నిరంతరం పర్యవేక్షణ కారణంతోనే సాధ్యమైందని అధికారులు భావిస్తున్నారు. ఈ కలెక్షన్ లో ఈ సారి శేరిలింగంపల్లి ప్రథమ స్థానంలో ఉంటుందని అధికారులు అంచనాలు వేయగా, ఎప్పటి లాగే ఖైరతాబాద్ జోన్ రూ.530.09 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ తో ముందుస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో శేరిలింగంపల్లి ఉండగా, అన్ని జోన్ల కన్నా తక్కువ, అత్యల్పంగా చార్మినార్ జోన్ లో రూ. 150.44 కోట్లతో చివరి స్థానంలో ఉంది.

Also Read: TG Govt on Fine Rice: హమ్మయ్య.. ఆ కష్టాలకు ఇక చెల్లు.. ఇది పేదవారి మాట.. ఎందుకంటే?

ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిదారులు జీహెచ్ఎంసీ 30 సర్కిళ్లలో సుమారు 19.5 లక్షల మంది ఉండగా, ఈ సారి జీహెచ్ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 14 లక్షల 8218 మంది బకాయిదారులు విధిగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఇంత భారీ సంఖ్యలో బకాయిదారులు ట్యాక్స్ చెల్లించటం ఇదే మొదటి సారిగా అధికారులు పేర్కొన్నారు. సర్కిళ్ల వారీగా గమనిస్తే రికార్డు స్థాయి కలెక్షన్ శేరిలింగంపల్లి సర్కిల్ రూ.288.14 కోట్ల కలెక్షన్ లో ముందుండగా, అన్ని సర్కిళ్ల కన్నా తక్కువ ఫలక్ నుమా సర్కిల్ లో కేవలం రూ.12.51 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.

ఫలించిన వారెంట్లు, సీజింగ్ లు 

ప్రతి సంవత్సరం చివరి మూడు నెలలు అంటే జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు జీహెచ్ఎంసీ అధికారులు ట్యాక్స్ కలెక్షన్ కోసం హడావుడి చేస్తుంటారు. కానీ ఈ సారి నవంబర్ 11న ఫుల్ ఛార్జి కమిషనర్ గా నియమితులైన ఇలంబర్తి తాను ఝార్కండ్ ఎలక్షన్ డ్యూటీ నిర్వహిస్తూనే జీహెచ్ఎంసీ ట్యాక్స్ కలక్షన్ ను నవంబర్ మాసం నుంచే నిరంతరంగా పర్యవేక్షిస్తూ వచ్చారు. ఇచ్చిన టార్గెట్ల ప్రకారం సిబ్బంది, అధికారులు ట్యాక్స్ కలెక్షన్ చేసేలా ఆయన చేసిన సూచనలు, సలహాలు ఫలించి, రికార్డు స్థాయిలో ట్యాక్స్ వసూలైంది.

అంతేగాక, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 5 లక్షల పై చిలుకు రెడ్ నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ వంటి వ్యాపార సంస్థలను కూడా సీజ్ చేయటం కలెక్షన్ పెరిగేందుకు కలిసొచ్చిందని చెప్పవచ్చు.

Also Read: Kanche Gachibowli land Dispute: హెచ్ సీయూ భూముల వివాదం.. కేంద్రం జోక్యం కోరిన బీజేపీ ఎంపీలు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు