Huzurabad: వరి కొయ్యకాల్లను పొలంలోనే కలియదున్నండి
Huzurabad ( image credit: swetcha reporter)
Telangana News

Huzurabad: వరి కొయ్యకాల్లను పొలంలోనే కలియదున్నండి.. ఎరువుల ఖర్చు తగ్గించే సాగు పద్ధతి ఇదే!

Huzurabad: వరి కోత తర్వాత మిగిలిన కొయ్యకాల్లను తగులబెట్టడం వల్ల కలిగే నష్టాలను, వాటిని పొలంలో కలియ దున్నడం ద్వారా కలిగే లాభాలను హుజూరాబాద్ (Huzurabad) ఏడీఏ (వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు) సునీత, నర్సింగాపూర్ గ్రామ రైతులకు క్షేత్ర సందర్శన ద్వారా వివరించారు.  ఆమె నర్సింగాపూర్ గ్రామంలో లోక్ సత్తా నాయకులు గూడూరి స్వామి రెడ్డి పొలాన్ని పరిశీలించారు. స్వామి రెడ్డి వరి కొయ్యకాల్లను తగులబెట్టకుండా పొలంలోనే కలియ దున్నిన విధానాన్ని ఆమె అభినందించారు. కొయ్యకాల్లను కాల్చడం వలన వాతావరణ కాలుష్యమే కాకుండా భూమి ఉత్పాదక సామర్థ్యం తగ్గి నేల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని సునీత రైతులకు తెలిపారు.

సేంద్రీయ ఎరువుగా మారుతాయి

వరి కొయ్యకాల్లను పొలంలో కలియదున్నడం వలన అవి సేంద్రియ ఎరువుగా మారి, భూసారాన్ని పెంచి, పంటకు అవసరమైన పోషకాలను అందిస్తాయని ఏడీఏ వివరించారు. దీనివల్ల రైతులు ఎరువుల ఖర్చును కొంత వరకు తగ్గించుకోవచ్చని సూచించారు. వరి కొయ్యకాల్లను నేలలో కలియ దున్నే ముంఎరువుల ఖర్చు తగ్గించే సాగు పద్ధతి ఇదేదు ఎస్ఎస్పీ (సింగిల్ సూపర్ ఫాస్ఫేట్) లేదా వేస్ట్ డీ కంపోజర్ను వాడి దున్నినట్లయితే, కొయ్యకాలు త్వరగా మురిగి సేంద్రీయ ఎరువుగా మారుతాయని ఆమె సూచించారు.

Also Read: Huzurabad News: తహసీల్దార్ ఆకస్మిక బదిలీకి రాజకీయ ఒత్తిళ్లే కారణమా..?

భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తుంది

అదేవిధంగా, పీఎస్బీ (ఫాస్ఫేట్ సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా) కల్చర్‌ను పొడి పెంటలో 7 రోజుల వరకు నీడ ప్రాంతంలో మాగనిచ్చి, నాటు వేసే ముందు దమ్ములో దున్నినట్లయితే చౌడు సమస్యను తగ్గించవచ్చని తెలిపారు. ఇది భూమిలో పేరుకుపోయి ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో నిఖిల్ కుమార్, గూడూరు మల్లారెడ్డి, గూడూరు లక్ష్మారెడ్డి, గూడూరి చైతన్య రెడ్డి, అన్నారావు, పల్లె వీరయ్య (మాజీ సర్పంచ్), దయ్యాల రాజు, దండ వెంకట రమణారెడ్డి, కాటిపేల్లి సంజీవరెడ్డి, గుండా నారాయణరెడ్డి, మెరుగు రవీందర్, ఆరే రామచంద్రం, దాట్ల బజార్, కాటిపెళ్లి సంజీవరెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.

Also Read: Huzurabad: కాలేజీ ఒకచోట, పరీక్షలు ఇంకోచోట.. వాగ్దేవి కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థుల అయోమయం!

Just In

01

Pakistan Spy: ఎయిర్‌ఫోర్స్ రిటైర్డ్ ఆఫీసర్ అరెస్ట్.. పాకిస్థాన్‌కు సమాచారం చేరవేస్తున్నట్టు గుర్తింపు!

CPI Narayana: ఐబొమ్మ రవి జైల్లో ఉంటే.. అఖండ-2 పైరసీ ఎలా వచ్చింది.. సీపీఐ నారాయణ సూటి ప్రశ్న

Lancet Study: ఏజెన్సీ ఏరియా సర్వేలో వెలుగులోకి సంచలనాలు.. ఆశాలు, అంగన్వాడీల పాత్ర కీలకం!

IndiGo: ప్రయాణికులకు ఇండిగో భారీ ఊరట.. విమానాల అంతరాయాలతో తీవ్రంగా నష్టపోయిన వారికి రూ.500 కోట్లకు పైగా పరిహారం

Cyber Crime: మంచి ఫలితాన్ని ఇస్తున్న గోల్డెన్​ హవర్.. మీ డబ్బులు పోయాయా? వెంటనే ఇలా చేయండి