New Accreditation: జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు
New Accreditation (image credit: swetcha reporter)
Telangana News

New Accreditation: జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి : హెచ్​యూజే కార్యవర్గం డిమాండ్!

New Accreditation: జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (Journalist) (హెచ్​యూజే- టీడబ్ల్యూజేఎఫ్) కార్యవర్గం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అక్రెడిటేషన్ ( Accreditation) కార్డుల గడువు ముగిసి 18నెలలు కావస్తున్నా ఇప్పటికీ పొడిగింపు స్టిక్కర్లతోనే సమాచార శాఖ కాలం గడుపుతోందని మండిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అక్రెడిటేషన్ పాలసీని ప్రకటించకపోవడం జర్నలిస్టుల పై ప్రభుత్వాని ఉన్న వైఖరికి నిదర్శనమని పేర్కొంది. హైదరాబాద్(Hyderabad) లోని త్యాగరాయ గానసభ లో హెచ్ యూజే అధ్యక్షుడు బి.అరుణ్ కుమార్ అధ్యక్షతన ఆ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది.

Also Read: Fee Reimbursement: రీయింబర్స్ మెంట్ పై ప్రభుత్వం రైట్ డెసిషన్.. పేరెంట్స్ హర్షం.. ఏందుకొ తెలుసా..?

జర్నలిస్టులకు న్యాయం చేసేలా ప్రత్యేక పాలసీ తీసుకురావాలి

వృత్తిపరంగా జర్నలిస్టులు (Journalist) ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఇండ్ల స్థలాలు,హెల్త్ కార్డులు, (Health cards) ఇతర సమస్యలపై నాయకులు చర్చించారు. జర్నలిస్టులకు (Journalist) ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు తీర్పుతో సమస్య జటిలమైందనీ, ఈ నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా జర్నలిస్టులకు (Journalist) న్యాయం చేసేలా ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరింది. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యచికిత్సలు అందేలా హెల్త్ కార్డుల (Health cards) ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.

ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ సీనియర్ ఉపాధ్యక్షుడు, అడ్ హక్ కమిటీ కన్వీనర్ పిల్లి రాంచందర్, ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు గుడిగ రఘ, హెచ్​యూజే కార్యదర్శి జగదీశ్వర్, హెచ్ యూజే అధ్యక్షుడు బి అరుణ్ కుమార్, హెచ్ యూజే వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, సలీమా, రాధిక, నిరంజన్, హెచ్ యూజే నాయకులు మధుకర్, రమేష్, బాలు, నిస్సార్, లలిత, విజయ, ప్రశాంత్, రేణయ్య, లక్ష్మణ్​ రావు, రాజేశ్, మాధవ రెడ్డి, కాలేబ్, సర్వేష్, శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.

Also Read: Handshake Controversy: ‘నో షేక్‌హ్యాండ్’ పరాభవం నుంచి బయటపడని పాక్.. కీలక అధికారిపై పీసీబీ వేటు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?