High Court: వీధి కుక్కల సంరక్షణ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలని తప్పకుండా పాటించాని GHMC కి కోర్టు ఆదేశాన్నిచ్చింది. వీధి కుక్కల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందని ఆస్రా సంస్ధ హైకోర్టును ఆశ్రయించింది. అందుక గాను కొర్టు ఆదేశాలు జారీ చేసింది. నగరంలో కుక్కల దాడులు పెరిగిపోతున్నాయని, జీహెచ్ఎంసీ అధికార ప్రభుత్వ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడంలో విఫలం అయిందని కోర్టు పేర్కొంది. కుక్కల కోసం సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని, వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయించిన చర్యలను పూర్తి స్థాయిలో పాటించాలని జీహెచ్ఎంసీకి కోర్టు ాఆదేశాలు జారీ చేసింది.
Also Read: Tirupati: రైలు ప్రయాణికులు ఎగిరి గంతేసే న్యూస్.. తిరుపతికి అదనపు ఎక్స్‌ప్రెస్ రైళ్లు!
నగరంలో వీదికుక్కలు దాడులు
వీధి కుక్కల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందని ఆస్రా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. నగరంలో వీదికుక్కలు దాడులు విపరీతంగా పెరిగిపోయాయని, దీంతో పాటుగా నగరంలో సరైన కుక్కల చికిత్స కేంద్రాలు లేనందున ప్రమాదాల్లో చాలా మంది తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని పేర్కోంది. చికిత్స కేంద్రాలు తక్కవగా ఉండటం, మరియు కుక్కలను రోడ్డుపై వదిలేయడం కారణంగా ఎక్కవ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆస్రా సంస్ధ తన పిటీషన్ లో పేర్కోంది. ఈ సమస్యపై వెంటనే స్సందించి తగు చర్యలు చేపట్టాలని సంస్ధ కోర్టును ఆశ్రయించింది.
Also Read: Bigg Boss 9 Telugu: మొదటి ఫైనలిస్ట్ కోసం జరిగే రణరంగంలో గెలిచేది ఏవరు?.. ఏం కిక్ ఉంది మామా..

