Weather Update (imagecredit:twitter)
తెలంగాణ

Weather Update: తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Weather Update: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈ క్రమంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. నేటి నుంచి రానున్న మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది.

నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ శాణ ఈ ప్రాతానికి ఎల్లో అలర్ట్స్ జారీచేసింది.

Also Read: Water Crisis: గిరిజన తండాలో నీటి కష్టాలు.. పట్టించుకోని అధికారులు!

రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో సాధారణం నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు.

Also Read: Jal Shakti Abhiyan: జలశక్తి అభియాన్‌లో దేశంలోనే.. తెలంగాణ 3వ స్థానం!

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!