Niloufer Hospital: నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్ సస్పెండ్ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త సూపరింటెండెంట్ గా డాక్టర్ విజయ్ కుమార్ ను నియమిస్తూ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఉత్తర్వులిచ్చారు. జనరల్ ట్రాన్స్ ఫర్ లో భాగంగా ఇటీవల ఆయన వరంగల్ ఎంజీఎం నుంచి నిలోఫర్ కు బదిలీపై వచ్చారు. వెంటనే ఎస్పీ(సూపరింటెండెంట్ గా)బాధ్యతలు స్వీకరించాలని ఆయనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ కూడా శుక్రవారం సర్క్యూలర్ ఇచ్చారు. ఇక సస్పెండైన డాక్టర్ రవికుమార్ వ్యవహారం నిత్యం వివాదాస్పదంగానే కనిపించేది. గతంలో జరిగిన క్లినికల్ ట్రయల్స్ ఇష్యూ దగ్గర్నుంచి లేటెస్ట్ గా ఎక్విప్ మెంట్ కొనుగోళ్ల లో గోల్ మాల్ వరకు ఇప్పటికే మూడు సార్లు ప్రభుత్వం ఆయనకు మోమోలు జారీ చేయడం గమనార్హం.
అయినప్పటికీ తన పనితీరు, ప్రవర్తనను మార్చుకోకపోవడంతో ప్రైవేట్ ఫార్మసీ నిర్మాణం అంశంలో ఎట్టకేలకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది. తనకు ప్రభుత్వ పెద్దల నుంచి వైద్యారోగ్యశాఖ కీలక అధికారుల వరకు అండదండలు ఉన్నాయని గ్లోబెల్స్ ప్రచారం చేసుకున్నా…చేసిన తప్పిదాలు, నిర్లక్ష్యాన్ని స్పష్టమైన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆయన అత్యుత్సాహమే ఎసరు పెట్టేసింది. మంత్రి , కలెక్టర్, డీఎంఈ అనుమతితోనే ఫార్మసీ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పిన అబద్ధాలు ..ఆయనను ఆ సీట్ నుంచి లేకుండా చేశాయి. ప్రభుత్వం రిలీజ్ చేసిన సస్పెండ్ ఆర్డర్ ను చూసి చివరకు ఆయన షాక్ గురికావాల్సి వచ్చింది.
Also Read: Mahabubabad Crime: పథకం ప్రకారమే మందు పార్టీ.. ఆపై టవల్‌తో హత్య!
ఏడాది లో పే ఊఫ్?
నిలోఫర్ ఇన్ చార్జీ సూపరింటెండెంట్ గా గత ఏడాది జూలై 24న డాక్టర్ రవికుమార్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికే సీనియర్ ప్రోఫెసర్ గా అదే ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం తన అత్యుత్సాహానికి కారణమైందనే విమర్శలు వచ్చాయి. సూపరింటెండెంట్ సీట్ లో కూర్చొన్న తర్వాత ఆయన నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు పెరిగాయని స్వయంగా ప్రభుత్వమే గుర్తించింది. దీంతో ఏడాది తిరగకముందే ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగిస్తూ సస్పెండ్ చేయడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత ని లోఫర్ కు ఇన్ చార్జీ సూపరింటెండెంట్ గా డాక్టర్ రవి కుమార్ ను నియమించారు. అయితే అప్పటికే ఆయనపై గతంలో ఇచ్చిన చార్జ్ మెమో ఉన్నది. దీంతో ఆయనకు ఎలా ఇస్తారంటూ కొందరు డాక్టర్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రశ్నించినప్పటికీ, ప్రభుత్వం నిర్ణయం మేరకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు రవి కుమార్ ను సూపరింటెండెంట్ గా నియమించాల్సి వచ్చింది. కానీ గతంలో క్లినికల్ ట్రయల్స్ నిర్లక్ష్యం, తదితర ఆరోపణలు మరువకముందే, బ్లడ్ బ్యాంక్ లో అవినీతిపై సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వహించారని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ కూడా గుర్తించింది. ఆ తర్వాత మిషన్ల కొనుగోలులో గోల్ మాల్ జరిగినట్లు కూడా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు అంచనా వేశారు. దీంతో వరుసగా చార్జ్ మెమోలు అందజేశారు.
స్వేచ్ఛ వరుస కథనాలు
నిలోఫర్ ఆసుపత్రి నిర్లక్ష్యంపై గత కొన్ని రోజుల నుంచి స్వేచ్ఛ వరుస కథనాలను ప్రచురించింది. బ్లడ్ బ్యాంక్ లో తప్పిదాలు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ ఓవరాక్షన్, బెడ్లు, బిల్లుల మధ్య తేడాలు, ట్రీట్మెంట్ లో, ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ లో లోపాలు తదితర అంశాలపై కంటిన్యూగా స్వేచ్ఛ కథనాలు ప్రచురించింది. స్పష్టమైన ఇన్మర్మేషన్ తో వార్తలు పబ్లిష్ చేసింది. దీంతో ప్రభుత్వం కూడా వివిధ కమిటీలు వేసి అన్ని నిజాలే అని నిర్ధారించింది. ఆ తర్వాత సూపరింటెండెంట్ ఇచ్చిన వివరణను క్రాస్ చెక్ చేసింది. వీటన్నింటిపై పూర్తి స్థాయిలో స్టడీ చేసిన సర్కార్, చివరకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది. తన పోస్టును కాపాడుకునేందుకు డాక్టర్ రవి కుమార్ చివరి నిమిషం వరకు విశ్వ ప్రయత్నాలు చేయడం గమనార్హం.
Also Read: CM Revanth On KCR: అసెంబ్లీకి రండి.. అద్భుతాలు సృష్టిద్దాం.. కేసీఆర్‌కు సీఎం విజ్ఞప్తి