Harish Rao (iamagecredit:twitter)
తెలంగాణ

Harish Rao: బస్తీ దవాఖాన వైద్య సిబ్బందికి వేతనాలు పెండింగ్: హరీష్ రావు

Harish Rao: పథకాల్లో కోతలు.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వాతలు అని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు. నెలల తరబడి టీవీవీపీ(TVVP), బస్తీ దవాఖానాల వైద్య సిబ్బందికి వేతనాలు చెల్లించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవు అనడానికి వేతనాలు అందక టీవీవీపీ, బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది పడుతున్న నరకయాతనే నిదర్శనం అన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం తప్ప ఆచరించింది లేదు, అమలు చేసింది లేదని దుయ్యబట్టారు.

నెలల తరబడి జీతాలు..

తెలంగాణ వైద్య విధాన పరిషత్ రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతి నెలా రెండు, మూడు వారాలు దాటినా జీతాలు రాని పరిస్థితి.. కాంట్రాక్టు(Contract, , ఔట్ సోర్సింగ్(outsourcing) ఉద్యోగులకైతే నెలల తరబడి జీతాలు అందని దుస్థితి అన్నారు. ఇక బస్తీ దవాఖాన వైద్య సిబ్బందికి అయితే ఆరు నెలలుగా వేతనాలు పెండింగ్ పెట్టి, చుక్కలు చూపిస్తున్నది కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అన్నారు. వైద్యులకు, ఇతర సిబ్బందికి బతుకమ్మ(Bathukamma), దసరా పండుగ సంబురం లేకుండా చేసి, వారిని మానసిక క్షోభకు గురి చేయడం తగునా? అని నిలదీశారు.

Also Read; Gold Rate Today: అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఎంత పెరిగిందంటే?

22 నెలల్లో చేసింది ఏమీలేదు..

వేతనాలు ఇవ్వాలని ఎన్నిసార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు. అత్యవసర సేవలు అందించే వైద్య సిబ్బందికే జీతాలు ఇవ్వకుంటే, ఇక ఇతర శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల్లో చేసింది ఏమీలేదన్నారు. పాలన వైఫల్యం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాపంగా మారిందన్నారు. జీతాలు ఇవ్వకుండా 13వేల మంది వైద్య సిబ్బందికి దసరా పండుగ దూరం చేశారన్నారు. కనీసం ఇప్పుడైనా జీతాలు ఇచ్చి వారికి దీపావళి సంబురాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: GHMC: కుర్చీ ఖాళీ కాకముందే, ఆ పోస్టింగుల కోసం జీహెచ్ఎంసీలో పైరవీలు!

Just In

01

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ మరొక్క రోజు వెనక్కి!.. ఎందుకంటే?

Gold Price Today: తగ్గిన గోల్డ్ రేట్స్.. కొనాలనుకునేవారికీ ఇదే మంచి ఛాన్స్!

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు