Harish Rao: ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు సాగునీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే నీటిని విడుదల చేసి వారిని ఆదుకోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శనివారం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ల ద్వారా గత ఆరు ఏళ్లుగా గోదావరి జలాలను అందించి రైతాంగాన్ని ఆదుకున్నామని హరీశ్ లేఖలో గుర్తు చేశారు.
Also Read: Harish Rao: ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ప్రశ్నిస్తూనే ఉంటాం.. సీఎంకు హరీశ్ రావు సవాల్!
3 లక్షల ఎకరాలకు సాగు నీరు
ఈ ప్రాజెక్టుల ద్వారా సిద్దిపేట, మెదక్, యాదాద్రి, జనగామ, సిరిసిల్ల జిల్లాల్లో సుమారు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోందని వివరించారు. యాసంగి సీజన్ ప్రారంభమై రైతులు నాట్లు వేశారని, కానీ నీటి విడుదలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. నీటి ప్రణాళిక కమిటీని తక్షణమే ఆదేశించి, కాలువల ద్వారా పొలాలకు నీరు అందించాలని కోరారు. అలాగే, గతంలో మాదిరిగా చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్‌లను నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఇరిగేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు.
Also Read: Harish Rao Investigation: పైనుంచి ఫోన్లు వచ్చాయ్.. సిట్ విచారణపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

