Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్.. ఓటర్లకు చీరలు, రైస్ కుక్కర్లు, డబ్బులు పంచి పెడుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
అధికార పార్టీకి తొత్తులుగా..
కాంగ్రెస్ నేతలు ఓటర్లకు పంచిపెడుతుండగా తీసిన ఫొటోలు, వీడియోలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి అందించినట్లు హరీశ్ రావు తెలియజేశారు. దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. పోలీసులతో పాటు ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారని హరీశ్ రావు విమర్శించారు. దీనిపై సి విజిల్ యాప్ లో ఫిర్యాదు కూడా చేసినట్లు చెప్పారు. ఇప్పుడు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చినట్లు తెలియజేశారు.
ఇంత జరిగినా మౌనం ఎందుకు?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో (Jubilee Hills Bypoll) ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఓటర్లు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం మౌనం వహించడం ఆవేదనకు గురిచేస్తోందని చెప్పారు. ఎన్నికల సంఘం పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నందువల్లే స్వయంగా కలిసి సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించాలని ఈసీని కోరినట్లు చెప్పారు. ఓటర్ ఐడీ గుర్తించిన తర్వాతే ప్రతీ ఒక్కరిని పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని కోరినట్లు హరీశ్ రావు తెలిపారు.
Also Read: Social Media Ban: ఆస్ట్రేలియా సంచలనం.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్.. ఇది వర్కౌట్ అయ్యేనా!
నకిలీ ఓటర్ కార్డులపై ఫైర్
మహిళా ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఈసీని కోరినట్లు హరీశ్ రావు పేర్కొన్నారు. ఇందుకోసం ఆశ, అంగన్వాడీ, మహిళా పోలీసులను ఏర్పాటు చేయాలని సూచించినట్లు చెప్పారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో ఇష్టం వచ్చినట్టు ఫేక్ ఓటర్ ఐడి లను క్రియేట్ చేశారని మండిపడ్డారు. కుప్పలు కుప్పలుగా అవి బయటకు వస్తున్నాయని ఆరోపించారు. వాటిని ఈసీ అధికారులు ఎందుకు కట్టడి చేయడం లేదని ప్రశ్నించారు. తాము చేసిన ఫిర్యాదులపై తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని సీఈఓ హామా ఇచ్చినట్లు హరీశ్ రావు అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలను చూస్తే సీఎం రేవంత్ కు చమటలు పడుతున్నాయని హరీశ్ రావు విమర్శించారు. రెండు ఏళ్లుగా ఆరు గ్యారంటీలపై సమీక్ష చేయని సీఎం రేవంత్.. ఇప్పుడే ఎందుకు రివ్యూ చేపట్టారని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ
దొంగ ఓటర్ కార్డులు కలకలం#fakevoteridcards #JubileeHillsByElection #FakeVoterID #Congress #Brs #Telangana #viralnow #swetchadaily pic.twitter.com/zf9iJSGXqh— Swetcha Daily News (@SwetchaNews) November 10, 2025
