Guvvala Balaraju
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Guvvala Balaraju: బీఆర్ఎస్‌పై గువ్వల బాలరాజు హాట్ కామెంట్స్

Guvvala Balaraju: కాపలా కుక్కల మంటూ రాష్ట్రాన్ని దోచేశారు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దొరల పంచన చేరి దళితులను విమర్శిస్తున్నారు
బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొవాలి
కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటే
మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కేఎస్ రత్నం

స్వేచ్ఛ, రాజేంద్రనగర్: తెలంగాణకు కాపలా కుక్కలమంటూ రాష్ట్రాన్ని పూర్తిగా దోచేశారని బీఆర్ఎస్‌పై అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) ఆరోపణలు గుప్పించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో గురుకుల పాఠశాల సెక్రటరీగా ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం పాటుపడ్డారని, వెనకబడిన తరగతుల అభ్యున్నతి కోసం, సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వారికోసం పాటుపడాలనుకుంటే రాజకీయాలు అవసరం లేదంటూ, రాజకీయాలంటే తనకు ఇష్టం లేదంటూ నాడు చెప్పారని, కానీ, నేడు రాజకీయాల్లో చేరి, ప్రజల కోసం పాటుపడుతున్న దళిత నాయకులను విమర్శిస్తున్నారని గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపులోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు సంబంధించిన బీజేపీ మండల అధ్యక్షుల ప్రశిక్షణ శిబిరానికి హాజరై గువ్వల బాలరాజు మాట్లాడారు.కేఎస్ రత్నం కూడా మీడియాతో మాట్లాడారు.

Read Also- Kishan Reddy: కేంద్రం నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైంది..కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందంటూ తెలంగాణ సమాజమంతా నిందిస్తోందని, బీఆర్ఎస్ పార్టీ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుందని గువ్వల బాలరాజు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట, లేదంటే కొన్ని పథకాల పేరు చెప్పి దోచుకున్నారని పేర్కొన్నారు. తొలుత తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు అని అన్నారని, రాష్ట్రం వచ్చిన తర్వాత తాము కాపలా కుక్కల్లాగా ఉంటామని బీఆర్ఎస్ పెద్దలు మాట్లాడారని గువ్వల బాలరాజు ప్రస్తావించారు. కాపలా కుక్కల్లాగా ఉంటామని చెప్పిన వాళ్లకు నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోషిస్తున్న పాత్రను చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్‌గా ఉండి ప్రజలకు రక్షణగా ఉండాల్సింది పోయి, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక తప్పులు వేసిన వారిని వెనుకేసుకొస్తుంటే, ఆర్ఎస్ ఆయన అబాసుపాలు అవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటే అని, నోరు ఉందికదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

Read Also- Arjun Tendulkar: సచిన్ కొడుకు అర్జున్ ఇప్పటివరకు ఎంత డబ్బు సంపాదించాడో తెలుసా?

పార్టీల మెప్పుకోసం, అధినాయకుల ఆశీర్వాదం కోసం ఇష్టానురీతిలో, దుర్మార్గంగా మాట్లాడితే సహించబోమని గువ్వల బాలరాజు హెచ్చరించారు. భారతదేశంలో ముక్తభారత్ అనాల్సిన అవసరం లేని పేర్కొన్నారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రజలు పాతాళానికి తొక్కారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు వచ్చిందో, దేనికి వచ్చిందో కానీ హామీలకు మోసపోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశామని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. అమలుకాని ఆ హామీల కారణంగానే ప్రజలు అభాసుపాలయ్యారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి చేస్తామన్నారు. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలకు వివరించి చెప్పి పార్లమెంటు ఎన్నికలలో ఏ విధంగా సున్నా వచ్చిందో అదే రీతిలో రాబోయే ఎన్నికల్లో కూడా జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కీసీఆర్ కూతురు, కేసీఆర్ కొడుకు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలందరూ ఆలోచన చేస్తా ఉన్నారని, పేదరిక నిర్మూల కోసం, పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. భారతదేశానికి రక్షణ కేవలం బీజేపీతోనే సాధ్యమని గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నారాయణ, అచ్చంపేట మండలం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, అమ్రాబాద్ మండలం అధ్యక్షుడు శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు బాతుకు శ్రీనివాస్ యాదవ్, బాలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ