Journalists
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Warangal: బీమాతో జర్నలిస్టుల కుటుంబాలకు ధీమా

Warangal: జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ పని చేస్తుందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తామని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అన్నారు. ప్రమాదాల బారిన పడి మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం జనరల్ ఇన్సూరెన్స్ చేయించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు, వారి కుటుంబాలకు ఇన్సూరెన్స్ చేయించి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. పలు కారణాల వల్ల హమీల అమలు కొంత ఆలస్యమైందని అందుకు చింతిస్తున్నామని చెప్పారు.

విమర్శలను పట్టించుకోకుండా ముందుకు

ఆర్థిక పరమైన విషయాలు, ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చించడం, కమిటీలో ఏకాభిప్రాయం రావడం లాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఆలస్యం జరిగిందని వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం చేస్తున్న ప్రమాద బీమాకు తోడు సహజ మరణం వర్తించేలా మరో ప్రత్యేక పాలసీ కూడా చేసేందుకు సంకల్పిస్తామని అందుకోసం కమిటీలో చర్చించి ప్రకటన చేస్తామని చెప్పారు. ఒకరిద్దరు సభ్యత్వం లేని వ్యక్తులు తమ కమిటీపై బురదజల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను తాము పట్టించుకోబోమని, హద్దు దాటి ప్రవర్తిస్తే వారికి కర్రు కాల్చి వాత పెట్టేందుకు అందరూ కలిసి రావాలని కోరారు.

Read Also- HHVM OTT: ‘హరి హర వీరమల్లు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?.. ఇంత ఎర్లీగానా?

బీమాపై అవగాహన

ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య మాట్లాడుతూ, తాము ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, గౌరవ సభ్యులకు మేలు చేసే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధి లక్ష్మణ్ రావు సభ్యులకు పాలసీ వివరాలను తెలియజేశారు. బీమాకు సంబంధించి పలువురు సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలు యూనియన్ల సభ్యులు గాడిపెల్లి మధు, వల్లాల వెంకటరమణ, కంకణాల సంతోష్, పెండెం వేణుమాధవ్, కోరుకొప్పుల నరేందర్, మట్ట దుర్గాప్రసాద్, గడ్డం కేశవమూర్తి, బుచ్చిరెడ్డి, రవీందర్ రెడ్డి, సంగోజు రవి, రాజేంద్రప్రసాద్, రాజేశ్వర్ రావు, రవి, రాజేందర్, మెండు రవీందర్, షఫీ, నాగరాజు, చెరుకు వేణుప్రసాద్, బండి పర్వతాలు, విజయ్ కుమార్, హరి, శ్రీధర్, సాల్మన్, వేముల సదానందం, కక్కెర్ల అనిల్ కుమార్, దాసరి ధనుంజయ్, పాషా, ప్రసాదరెడ్డి, రాజు, ప్రెస్ క్లబ్ బాధ్యులు గోకారపు శ్యాం, బొడిగె శ్రీను, కొడిపెల్లి దుర్గాప్రసాదరావు, పొడిచెట్టి విష్ణువర్థన్, బూర్ల నరేందర్, వలిశెట్టి సుధాకర్, వీరగోని హరీష్, ఎండీ నయీం పాషా, బాలవారి విజయ్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Read Also- Andaman: అండమాన్ ద్వీపంలో తొలిసారి అడుగుపెట్టిన ఈడీ.. రూ.200 కోట్ల కేసు..

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు