anjireddy
తెలంగాణ

Graduate MLC Results: గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఘన విజయం

Graduate MLC Results: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక(Graduate MLC Elections)ల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి (Anjireddy) ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి(Anji Reddy) విజయాన్ని దక్కించుకున్నారు. కాసేపట్లో దీనిపై అధికారులు అధికారిక ప్రకటన చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.  విజయం సాధించేందుకు 1,11,672 ఓట్లు పొందాల్సి ఉండగా చివరికి ఫలితం అంజిరెడ్డికే అనుకూలంగా రావడం విశేషం. అంతకుముందు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు.  విజయానికి కావాల్సిన ఓట్లు ఎవరికీ రాకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఆ ప్రక్రియలో కొన్ని ఓట్లు ఎలిమినేట్‌ అయ్యాయి. తొలి ప్రాధాన్యతలో చెల్లుబాటు అయిన ఓట్లు 2,23,343 కాగా, 28,686 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు.

Also Read: 

Teenmar Mallanna: నన్ను సస్పెండ్​ చేసినా… బీసీ ఉద్యమం ఆగదు

 

Just In

01

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!