teenmar Mallanna
తెలంగాణ

Teenmar Mallanna: నన్ను సస్పెండ్​ చేసినా… బీసీ ఉద్యమం ఆగదు

Teenmar Mallanna: తనను కాంగ్రెస్(Congress)​ పార్టీ నుంచి సస్పెండ్(Suspend)​ చేసినప్పటికీ బీసీ ఉద్యమం(BC Movement) ఆగదని ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న(MLC Teenmar Mallanna) స్పష్టం చేశారు. సస్సెన్షన్​ అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చిన మల్లన్న అలియాస్​ చింతపండు నవీన్​… రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన(Cast Census) దేశానికి ఆదర్వంగా ఉండాలని, రాహుల్​ గాంధీ(Rahul Gandhi) తలెత్తుకు తిరగాలని ఆశించానని తెలిపారు. నూటికి నూరు శాతం పారదర్శకంగా సర్వే చేస్తేనే ఆదర్శంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కుల గణనలో అగ్ర వర్ణాలను(OC) ఎక్కువ చూపించి బడుగు, బలహీన వర్గాల(BC)ను తక్కువ చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

కాగా, 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీన్మార్​ మల్లన్న కాంగ్రెస్​ పార్టీలో చేరారు. అనంతరం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా గెలుపొందారు. అయితే, ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్​ లో హామీ ఇచ్చిన మేరకు అధికార కాంగ్రెస్​ కులగణనను చేపట్టింది. దాదాపు రెండు నెలల పాటు సుదీర్ఘంగా ఈ ప్రక్రియను చేపట్టిన అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో వివరాలను వెల్లడించారు. అయితే కుల గణనలో సర్వే తప్పుల తడక అని, బీసీలను తక్కువ చేసి చూపించారని సొంత పార్టీ అయినప్పటికి తీన్మార్​ మల్లన్న ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. సర్వే రిపోర్టును కాల్చేశారు. ఓ బహిరంగం సభలో ఓ వర్గంపై ఆయన చేసిన కామెంట్స్​ అత్యంత వివాదస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయనకు కాంగ్రెస్​ క్రమశిక్షణ కమిటి(Disciplinary Committee) ఫిబ్రవరి 5న నోటీసులు జారీ చేసింది. 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కోరింది. అయిన మల్లన్న నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సస్పండ్​ చేస్తున్నట్లు ప్రకటించింది.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?