GIS Connectivity: వృధాగా పోతున్న వర్షపు నీటిని ఒడిసి పట్టి, భూమిలోకి ఇంకిపోయేలా చేసేందుకు ప్రతి ఒక్కరూ వర్షపు నీటిని ఒడిసి పట్టాలని జలమండలి మరోసారి పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లో ‘వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలోకి ఇంకేలా చేద్దాం, భూగర్భజలాలను పెంపొందించుకుందాం అనే నినాదంతో ‘ఇంకుడు గుంతల జలయజ్ఞం–2025’కి జలమండలి సిద్దమైంది. ఇప్పటికే అమలు చేస్తున్న 90 రోజుల ఇంటింట ఇంకుడు గుంత’ కార్యక్రమంలో భాగంగా 50 రోజుల ప్రత్యేక కార్యాచరణను వచ్చే వారం నుంచి అమలు చేసేందుకు జలమండలి రంగం సిద్దం చేసింది.
నగరంలో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదవుతున్నా, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరిస్తున్న నివాస, వాణిజ్య సముదాయలతో పాటు ఖాళీ స్థలాలు, బహిరంగ ప్రదేశాలన్నింటిని కాంక్రీట్‌తో కప్పేస్తుండటంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేక భూగర్భజలాలు(Groundwater) అడిగంటిపోతున్నట్లు జలమండలి గుర్తించింది. ఫలితంగా తాగు నీటి కంటే నిత్యావసరాల నీటి కోసం ట్యాంకర్ల డిమాండ్ పెరుగుతున్నట్లు గుర్తించిన జలమండలి ప్రజల్లో బాధ్యతను పెంచి భూగర్భ జలాలను పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. నగర తాగు నీటి అవసరాల కోసం జలాలను సుదూర ప్రాంతాల జలాశయాల నుంచి తరలించి శుద్ది చేసి సరఫరా చేస్తుందుకు కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుండగా, నగరంలో కురుస్తున్న వర్షపు మిలియన్ కొద్ది చుక్కలు వరద ప్రవాహంగా మారి మురుగు నాలాల్లో వృధాగ కలిసి పోతుండడాన్ని జలమండలి సీరియస్ గా తీసుకుని, అందులో కనీసం సగం వరకైనా భూమిలో ఇంకేలా చేయాలని సిద్దమైంది.
అప్‌లోడ్ చేసే విధంగా చర్యలు
భూగర్భజలాలను పెంచితే సీజన్‌తో సంబంధం లేకుండా నిత్యావసరాల కోసం సరఫరా చేసే ట్యాంకర్ డిమాండ్ తగ్గుతుందని జలమండలి యోచిస్తుంది. నీటి సంరక్షణలో భాగంగా వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలోకి ఇంకేలా చేసేందుకు, భూగర్భజలాల పెంపు లక్ష్యంగా వచ్చే వారం నుంచి సెప్టెంబర్ 30 వరకు నాలుగు రకాల ‘గ్రౌండ్‌వాటర్ రీచార్జీ ’ ప్రణాళిక అమలుకు జలమండలి సిద్దమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే జలమండలి ఎండీ ఆశోక్ రెడ్డి(MD Ashok Reddy) జూమ్ మీటింగ్ ద్వారా డివిజన్ జీఎం నుంచి మేనేజర్ల వరకు క్షేత్ర స్థాయిలో రోజువారిగా ఇంకుడు గుంతల పురోగతిని జీఓఎస్ ట్యాంగింగ్ ద్వారా మొబైల్ యాప్(Mobile App)లో అప్‌లోడ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజా బహిరంగ స్దలాల్లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల ను జీఐఎస్(GPS) మ్యాపింగ్‌తో డ్యాష్ బోర్డు ద్వారా పర్యవేక్షించాలని నిర్ణయించింది. ఇప్పటికే గుర్తించిన ‘ప్రజా ఇంకుడు గుంత’ల ప్రాంతాలను జీయో ట్యాగ్(Jio Tag) చేయాలని, నిర్మాణం ముందు, నిర్మాణం తరువాత తీసిన ఫోటోలను అప్ లోడ్ చేసే వీలుగా ఐటీ విభాగం ప్రత్యేక మొబైల్ యాప్ రూపకల్పన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజా ఇంకుడుచగుంతల నిర్మాణం పురోగతిని తెలుసుకునే విధంగా మొబైల్ యాప్ అనుసంధానంతో ప్రత్యేకమైన డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత
వర్షపు నీటి సంరక్షణలో భాగంగా 300 చదరపు మీటర్ల గల ప్రతి ఇంటా భూగర్భ జలాలను రీస్టోర్ చేసుకునే దిశగా ప్రాంగణంలో ఇంకుడుగుంత తప్పని సరి చేస్తూ జలమండలి చర్యలు చేపట్టింది. పాత, కొత్త నివాస, వాణిజ్య సముదాయాలపై దృష్టి సారించింది. నల్లా కనెక్షన్ క్యాన్ నెంబర్ ఆధారంగా సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి నెలా 20 కంటే ఎక్కువ ట్యాంకర్లను బుక్ చేసుకునే ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో భూగర్భజలాలు రీఛార్జ్ అయ్యే,దుకు అవసరమైన చర్యలను చేపట్టింది. ఇప్పటికే సుమారు 42,784 క్యాన్ నెంబర్లను గుర్తించి 40,209 నివాససముదాయలపై సర్వే నిర్వహించగా, కేవలం 22,825 నివాసాల్లో నే ఇంకుడు గంతలున్నట్లు, 17,384 నివాసాల్లో ఇంకుడు గుంతలు లేదన్న విషయం బయటపడింది.
దీంతో ఇప్పటివరకు 16,196 గృహాలకు నోటీసులు జారీ చేసి ఇంకుండు గుంత తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టింది. ప్రాంగణంలో కాలానుగుణంగా ఒకే ఒక బోర్ బావి పనిచేస్తుంటే ఇంజెక్షన్ బావి కోసం 60 మీటర్లు లేదా 200 లోతు వరకు భూమి మట్టానికి దిగువన డ్రిల్లింగ్‌కి కొత్త బోర్ బావి ఏర్పాటు చేసుకునే విధంగా సిఫార్సు చేయాలని నిర్ణయించింది.
Also Read: Trump on India: భారత్‌పై మరోసారి విషం కక్కిన డొనాల్డ్ ట్రంప్.. 24 గంటల్లో..
పబ్లిక్ ప్లేస్ లలోనూ
భూగర్భజలాల పెంపు కోసం ఖాళీగా పడి ఉన్న పబ్లిక్ ప్లేస్ లలోనూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాలనీలు, ప్రభుత్వ సముదాయాలు, విద్యా సంస్ధలు, రోడ్డు పక్కన గల నివాస, వాణిజ్య సముదాయల రూఫ్ టాప్ నుండి కిందికి పడే వర్షపు నీటిని పైపుల ద్వారా సంరక్షణ కోసం ప్రజా ఇంకుడు గుంతల ఏర్పాటుకు సిద్దమైంది. ఇప్పటికే జలమండలి బృందాలు ఎన్జీఓల సహకారంతో సర్వే ద్వారా ఎక్కడెక్కడ ప్రజా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలన్న ప్రాంతాలను గుర్తిస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఒక్కో జలమండలి డివిజన్ లో 16 వేల వరకు ప్రజా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
హార్వెస్టింగ్ పిట్స్‌గా హ్యాండ్ పంప్స్
నిరుపయోగంలో ఉన్న బోరు బావులను హార్వెస్టింగ్ పిట్‌లతో ఇంజక్షన్ బోర్‌వెల్‌గా మార్చాలని జలమండలి నిర్ణయించింది. ఇప్పటికే సుమారు 3,222 బోర్ వెల్స్‌లను జలమండలి గుర్తించింది. అందులో పవర్ బోర్‌వెల్స్ 1,045 ఉండగా, వాటిలో కోర్ సిటీ పరిధిలో 246, శివారు పరిధిలో 7,99 బోర్లు ఉన్నట్లు గుర్తించింది. హ్యాండ్ బోర్‌వెల్స్ 2,177 ఉండగా, వాటిలో కోర్ సిటీలో 1,665, శివార్లలో 1,557 బోర్లు ఉన్నాయని, మరిన్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
కమ్యూనిటీ ఇంకుడు గుంత
ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని గెటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవన సముదాయాల్లో ‘కమ్యూనిటీ ఇంకుడు గంత’ లు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రత్యేక అవగాహన కార్యాక్రమాలను నిర్వహించేందుకు జలమండలి ప్రణాళికలను సిద్దం చేస్తుంది. ఓఆర్‌ఆర్ లోపల, అవతల గెటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల అపార్ట్ మెంట్లను గుర్తించారు. అయా నివాస సముదాయలకు ఇంకుడు గుంతల ప్రాధాన్యం, వాటి నిర్మాణ ఆవశ్యకతలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
Also Read: GHMC officials: జీహెచ్ఎంసీలో ఇంటి దొంగలు.. లెక్కకు మించి వసూళ్లు