TG Government Lands: ప్రభుత్వ భూములను ఆసరా చేసుకొని కొంతమంది నాయకులు వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో భూములతోనే నాయకులు వ్యాపారాలు చేసి రైతులను మోసం చేశారానే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం నూతన పద్ధతిని ఆవలంబిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రంగారెడ్డి(Rangareddy) జిల్లా కలెక్టర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రభుత్వ భూమి పరిరక్షణపై ప్రత్యేక ద్రుష్టి పెట్టారు. కబ్జాదారుల నుంచి రక్షించిన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయడం, సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ప్రజల్లో నమ్మకం కలిగించేలా చర్యలు ఉన్నట్లు తెలుస్తుంది. అయినప్పటికీ కబ్జాదారులు కోర్టులను ఆశ్రయించి స్టే ఆర్డర్లతో కైవసం చేసుకోవాలనే కుట్రలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ, అసైండ్ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
అసైండ్ భూములు సైతం అన్యాక్రాంతం..
భూమిలేని నిరుపేదలకు గత ప్రభుత్వాలు సాగు చేసుకుంటారని భూ పంపణి చేశారు. కానీ గత 10యేండ్లుగా పేదలకు ఇచ్చిన భూములను పెద్దలు లాగేసుకొని పట్టాలు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ధరణి పోర్టల్ తెచ్చి పేదల భూములను గత ప్రభుత్వాలోని నాయకులు రియల్ వ్యాపారులతో కుమ్మకైనట్లు ప్రచారం నేటికి కొనసాగుతుంది. ప్రధానంగా పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని అసైండ్ భూములను కొనుగోలు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. పేదలు వ్యాపారుల చేతిలో మోసపోవద్దని ఉద్దేశ్యంతో అసైండ్ భూములు ప్రభుత్వం పరిహారం ఇచ్చి తీసుకోవాలని ఆలోచిస్తుంది. దీంతో అటు పేదలకు, ఇటు ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వ యోచన. క్రమ క్రమంగా అవసరమైన ప్రాంతాల్లో అసైండ్ భూమిని పూలింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read; Investment Fraud: భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించి.. నిండా ముంచారు!
సమానంగా న్యాయం జరిగే అవకాశం..
అందులో భాగంగానే షాబాద్, మొయినాబాద్ మండలాల్లో ప్రభుత్వ, అసైండ్ భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడం జరుగుతుంది. దీంతో ప్రభుత్వం భూమిని అభివృద్ధికి కోసం వినియోగించునుంది. అసైండ్ లబ్ధిదారులకు కూడా అత్యధికంగా మేలు జరిగే అవకాశం ఉంది. పట్టాదారులతో సమానంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్, యాచారం మండలాల్లో ఇప్పటికి వేల ఎకరాల భూమిని గ్రీన్ ఫార్మసిటీ పేరుతో భూసేకరణ చేశారు. ఇతర కంపెనీల కోసం కొంగరకలాన్ తిమ్మాపూర్లో భూ సేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే మొయినాబాద్ మండలం ఎన్నకెపల్లి గ్రామంలో, షాబాద్ మండలంలో కలిపి అసైండ్ భూమిని ప్రభుత్వం సేకరించింది. దీంతో రైతులకు నష్టంలేకుండా నష్టపరిహారం చెల్లించారు. భవిష్యత్లో మరింత ల్యాండ్ పూలింగ్ చేసే అవకాశం ఉంది.
అసైండ్ భూమిని గుర్తించే పనిలో ప్రభుత్వం
రంగారెడ్డి జిల్లాలోని 26మండలాలోని 321 గ్రామాల్లోఅసైండ్ భూమిని పేదల పంపిణి చేశారు. అసైండ్ కమిటీ లెక్కల ప్రకారం సుమారుగా 5,540 మందిరైతులకు 8,471 ఎకరాల వరకు పంపిణి జరిగినట్లు సమాచారం. ఈభూమి లబ్ధిదారుల చేతిలోనే ఉందా.. ఇతరుల చేతిలోఉందా అనే ప్రక్షాళన ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నట్టు తెలుస్తుంది.
Also Read: Bigg Boss 9 Telugu Promo: తనూజ మూతిపై దాడి.. హోస్‌లో మళ్లీ రచ్చ రచ్చ.. ప్రోమో చూస్తే గూస్ బంప్సే!