Mallareddy Medical College: మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి డీమ్డ్ హోదా ఎలా వచ్చిందని..? ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఆ యూనివర్సిటీపై నిత్యం కంప్లైట్స్ వస్తుండటంతో డీమ్డ్ హోదాపై ఎంక్వయిరీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీపై ఫోకస్ పెట్టారు. కాళోజీ వర్సిటీ నుంచి ఎన్ వోసీ తీసుకొలేదని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి స్థాయిలో ఎంక్వైయిరీ తర్వాత వర్సిటీ అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనున్నారు.
అంతేగాక గతంలో రాష్ట్ర వ్యాప్తంగా డీమ్డ్ హోదా పొందిన అన్ని యూనివర్సిటీలపై ఎంక్వైయిరీ చేయనున్నట్లు వర్సిటీ ఆఫీసర్లు వెల్లడిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు అడ్డదారిలో డీమ్డ్ హోదా పొందినట్లు వర్సిటీ అనుమానిస్తుంది. ఇదే అంశంపై తాజాగా కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నుంచి యూజీసీ(యూనైటెడ్ గ్రాంట్ కమిషన్ )కి లేఖ కూడా రాసినట్లు తెలిసింది. అవసరమైతే లీగల్ ఫైట్ కూడా చేస్తామని కాళోజీ వర్సిటీ అధికారుల్లో ఒకరు తెలిపారు.
డీమ్డ్ హోదా పొందేందుకు ఎన్ వోసీ ఇవ్వాలంటూ ఇటీవల దరఖాస్తు పెట్టిన మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల ను కూడా వర్సిటీ హోల్డ్ లో పెట్టినట్లు ఆయన వివరించారు. నార్త్ స్టేట్ లో అధికంగా ఉండే డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీల కల్చర్ క్రమంగా తెలంగాణ లో పెరుగుతుందని, దీని వలన సొంత రాష్ట్ర విద్యార్ధులకు నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు.
Also Read: Local body election Results: కౌంటింగ్ స్టార్ట్… ఫలితం ఇప్పటికే బయటపడ్డట్లే!
సర్కార్ అసంతృప్తి వెనక కారణమా..?
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఫీజులను ఫీజు రెగ్యులేటరీ కమిటీ నిర్ణయిస్తుండగా, వీటిపై కాళోజీ వర్సిటీ నియంత్రణ ఉంటుంది. కానీ ప్రైవేట్ యూనివర్సిటీ, డీమ్డ్ వర్సిటీల్లో వాటి యాజమాన్యాలే తమ ఫీజును సొంతంగా నిర్ణయించుకుంటున్నాయి.ఈ నేపథ్యంలోనే ఫీజుల్లో అడ్డగోలు దోపిడి జరుగుతుంది. యాజమాన్యాలు నిర్ణయించిన ప్రకారం అధిక ఫీజులు చెల్లించినోళ్లకే సీట్లు లభించడం అనివార్యమవుతుంది.
నీట్‌లో మెరిట్ ర్యాంకులు సాధించకపోయినా,డబ్బులు ఉంటే ఆయా కాలేజీల్లో ఈజీగా సీట్లను కేటాయిస్తారు. దీని వలన క్వాలిటీ డాక్టర్లు తయారయ్యే పరిస్థితి ఉండదని అధికారులు చెప్తున్నారు.మరోవైపు ఆయా యూనివర్సిటీలు కాళోజీ హెల్త్ పరిధిలో ఉండవు. దీంతో డీమ్డ్ యూనివర్సిటీలే ఎగ్జామ్స్ నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సదరు విద్యార్ధులకు మంచి మార్కులు వేసి పాస్ చేయించే ఛాన్స్ కూడా ఉంటుంది. అంతేగాక ప్రస్తుతం ఎంబీబీఎస్ మార్కులు ఆధారంగానే మెడికల్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేస్తున్నారు.ఈక్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీల విద్యార్ధులే టాపర్లుగా నిలిచే ప్రమాదం ఉంటుంది. దీంతోనే డీమ్డ్ వ్యవస్థను కంట్రోల్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
లోకల్ రిజర్వేషన్ గాయబ్..?
రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్సిటీలు,ప్రైవేట్ యూనివర్సిటీల వలన లోకల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి లేదు. డీమ్డ్ హోదా పొందిన విశ్వవిద్యాలయాల్లోని మెడికల్ అడ్మిషన్లకు కన్వీనర్ కోటా లేదు. కేవలం మేనేజ్ మెంట్ కోటా(బీ కేటగిరీ) లో మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేస్తున్నారు. పైగా లోకల్ రిజర్వేషన్ లేకుండానే సీట్లు నింపుతున్నారు. కేంద్రం ఇచ్చే ప్రత్యేక రూల్స్ తోనే ఇలాంటి పరిస్థితి తయారైంది.
అంతేగాక ఆయా యూనివర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ కూడా లేకపోవడం తో లోకల్ కోటాతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వంటి రిజర్వేషన్లేవీ అమలు కావడం లేదు. దీంతో మేనేజ్ మెంట్ కోటాలో టాలెంట్ కంటే, డబ్బులున్నోళ్లకే సీట్లు లభిస్తున్నాయనే ప్రచారం జరుగుతున్నది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ కోటాలో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలతో పాటు ఎన్ ఆర్ ఐ విద్యార్ధులకైనా సీట్లు కేటాయించే వెలుసుబాటు ఉన్నది.
దీని వలన డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలు భాగా లబ్ధి పొందుతున్నాయి. వాస్తవానికి కన్వీనర్ కోటా సీట్లను మెరిట్ విద్యార్థులకు కేటాయించి, ఆ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు సొంతంగా ఏడాదికి రూ.లక్ష కంటే తక్కువే ఖర్చు అవుతుంది. దీంతో మెరిట్ ర్యాంక్ సాధించిన పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎంబీబీఎస్ చదివే ఛాన్స్ ఉంటుంది. కానీ డీమ్డ్ యూనివర్సిటీలు పెరిగితే కన్వీనర్ కోటా పూర్తిగా కనుమరుగు అవుతుంది. అప్పుడు బీ కేటగిరి(మేనేజ్ మెంట్ కోటా) లోని 85 శాతం లోకల్ రిజర్వేషన్ల నిబంధన వీటికి వర్తించదు. డీమ్డ్ హోదా లేని కాలేజీల్లో ప్రస్తుతం ఈ రిజర్వేషన్ అమలు అవుతున్నది.
Also Read: IG Satyanarayana: తప్పుడు ప్రచారంపై చర్యలు ఖచ్చితం.. ఐజీ హెచ్చరిక!
మెరిట్ వచ్చినా…మేనేజ్ మెంట్ కు వెళ్లాల్సిన దుస్థితి..?
రాష్ట్రంలో డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీల పెరుగుతుండటంతో కన్వీనర్ కోటా సీట్లు తగ్గిపోతున్నాయి. తద్వారా మెరిట్ ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా మేనేజ్‌మెంట్ కోటాలో జాయిన్ అవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీని వలన తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్ధులకు అన్యాయం జరుగుతుందని మెడికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో ఉండే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్న 50 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో, 35 శాతం సీట్లను బీ(మేనేజ్ మెంట్) కేటగిరీలో, 15 శాతం సీట్లను సీ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. దీని ప్రకారం మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో 400 ఎంబీబీఎస్ సీట్లలో, 200 సీట్లు కన్వీనర్ కోటాలోకి రావాలి. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని యూజీసీ వాటికి ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీ హోదాను ఇవ్వడంతో సీట్లన్నీ మేనేజ్‌మెంట్ కోటాలోకే వెళ్లిపోయాయి. దీంతో డబ్బున్నోళ్లకే సీట్లు దక్కే అవకాశం ఉన్నది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు
