Gender Equality: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Gender Equality (imagecredit:twitter)
Telangana News

Gender Equality: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు బడుల్లో కీలక మార్పులు

Gender Equality: తెలంగాణలో విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విద్యలో నాణ్యత ప్రమాణాలు మెరుగు పరచడంతో పాటు విద్యార్థులకు జెండర్ ఈక్వాలిటీ(Gender equality), హెల్త్(Health), ఫైనాన్షియల్(Financial), లీగల్(Legal), సెల్ఫ్​ డిఫెన్స్(Self Difence), డ్రగ్స్ తీసుకుంటే ఎదురయ్యే పరిణామాలపై అవగాహన కల్పించాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. దీనికి గాను రాష్​ట్రంలోని అప్పర్ ప్రైమరీ(Upper Primary), హైస్కూళ్లు(High School), కేజీబీవీ(KGBV), మోడల్ స్కూళ్లు(Model School), రెసిడెన్షియల్ స్కూళ్ల(Residential schools)లో జెండర్ ఈక్వాలిటీ క్లబ్స్ ను ఏర్పాటు చేయనుంది. గర్ల్ చైల్డ్ ఎంపవర్ మెంట్ అండ్ భద్రత క్లబ్(Girl Child Empowerment and Safety Club) పేరిట కమిటీలు ఏర్పాటుచేయనుంది.

స్కూళ్లలో గ్రీవెన్స్ సిస్టమ్..

కో ఎడ్యుకేషన్, గర్ల్స్, బాయ్స్ స్కూళ్లలో వేర్వేరుగా వీటిని ఏర్పాటుచేయనున్నారు. ప్రతి స్కూళ్లో ఒక గ్రీవెన్స్ తో పాటు ఫిర్యాదుల బాక్స్ ను ఏర్పాటు చేయనున్నారు. కౌమార దశలో విద్యార్థి, విద్యార్థినులు ఎదుర్కొనే పలు అంశాలపై ఈ క్లబ్ అవగాహన కల్పించనుంది. ఫైనాన్షియల్ లిటరసీ, లీగల్ లిటరసీపై నాలెడ్జ్, స్కిల్స్ పెంపొందించడంపై దృష్టిసారించనున్నారు. అంతేకాకుండా సైబర్ సెక్యూరిటీ, డ్రగ్ అబ్యూస్, మెంటల్ హెల్త్, లైఫ్ స్కిల్స్, సెల్ఫ్ డిఫెన్స్ వంటి అంశాలపై ఈ క్లబ్ అవగహన కల్పించనుంది. స్కూళ్లలో గ్రీవెన్స్ సిస్టమ్ ను ఏర్పాటుచేసి స్కూల్, స్థానిక పోలీసులకు లింకేజ్ ఉంటేలా ఏర్పాటు చేయనున్నారు. చైల్డ్ సేఫ్టీ, బాల్య వివాహాలు, సైబర్ సేఫ్టీ వంటి అంశాలపై రిపోర్ట్ చేసేందుకు మెఖానిజం రూపొందించనున్నారు.

Also Read: CM Revanth Reddy: రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులను తక్షణమే మూసివేయాలి.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి

లోకల్ పోలీస్ కానిస్టేబుల్..

ఈ క్లబ్ లో దాదాపు 14 నుంచి 16 మంది ఉంటారు. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రతి క్లాసులో ఇద్దరు విద్యార్థులు ఈ క్లబ్ లో ఉంటారు. కేజీబీవీ, మోడల్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూళ్లలో(ఇంటర్) ప్రతి గ్రూపు లేదా సెక్షన్ కు ఒక విద్యార్థి ఈ క్లబ్ లో ఉంటారు. ఈ క్లబ్ చైర్మన్ గా స్కూల్ హెడ్ మాస్టర్/హెడ్ మిస్ ఉంటారు. ప్రతి క్లాస్ లేదా సెక్షన్ నుంచి ఒక విద్యార్థి చొప్పున మొత్తం దాదాపు 10 నుంచి 12 మంది విద్యార్థులు, ఒక మేల్, ఒక ఫిమేల్ టీచర్లు, లోకల్ పోలీస్ కానిస్టేబుల్ ఎక్స్ టర్నల్ మెంబర్ గా ఉంటారు. ప్రతి స్కూల్ లో ఒక కేవలం విద్యార్థినుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ బాక్స్(Grievance Box), మరొకటి జనరల్ కంప్లైట్స్ బాక్స్(General Complaints Box)​ ను ఏర్పాటుచేయనున్నారు. కాగా వీటి ఏర్పాటుకు ప్రతి స్కూల్ కు రూ.4 వేల చొప్పున బడ్జెట్ ను కూడా కేటాయించారు. కాగా విద్యార్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆయా నెలల వారీగా అవగాహన కల్పించాల్సిన అంశాలపై విద్యాశాఖ షెడ్యూల్ ను ఫిక్స్ చేసింది. జిల్లాల వారీగా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ క్లబ్ కార్యకాలపాలు సాగించనుంది. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు రాష్​ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్లబ్ లు ఎంత మేరకు సత్ఫలితాలిస్తాయన్నది చూడాలి.

Also Read: Lightning Strikes: పొలం పనులు చేస్తుండగా.. కూలీ కుటుంబాల్లో పిడుగుపాటు విషాదం

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..