Medical College Professors: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 33 స్పెషాలిటీ విభాగాల్లో 309 మందికి ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చింది. ఈ మేరకు హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ జీవో రిలీజ్ చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన వాళ్లకు(Posting in medical colleges)మెడికల్ కాలేజీల్లో పోస్టింగ్‌లు కేటాయించారు. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పండగ వాతావరణం నెలకొన్నది.
ఓ వైపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు, మరో వైపు టీచింగ్ ఫ్యాకల్టీకి ప్రమోషన్లు ఇస్తూ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇటీవలే 44 మంది ప్రొఫెసర్లకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ, మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్స్, టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లుగా వారికి పోస్టింగ్స్ ఇచ్చారు. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ(Damodara Rajanarsimha)ఆదేశాల మేరకు తాజాగా, అసోసియేట్ ప్రొఫెసర్లకు, ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు కల్పించారు. త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు ఇవ్వనున్నారు.
Also Read: Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆమోదం
ఇదిలా ఉండగా, ఇటీవలే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నది. అంతేగాక మరో 714 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది. ఇవన్నీ మెడికల్ కాలేజీల్లో మరింత క్వాలిటీ పెరిగేందుకు చర్యలుగా ప్రభుత్వం భావిస్తున్నది.
అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా పదోన్నతి చేయడంలో అత్యంత పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా, సీనియారిటీ ప్రకారం జరిగిన ఈ ప్రక్రియ చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కిరణ్, సెక్రెటరీ జనరల్ డాక్టర్ కిరణ్ మాదాల, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్లు డాక్టర్లు రమేష్, కిరణ్ ప్రకాష్, సుమలతలు తెలిపారు. ఏ ప్రభుత్వం చేయని సాహసోపేతమైన చర్య తీసుకున్నట్లు కొనియాడారు. మూడు అర్హత గల బ్యాచులను పరిగణనలోకి తీసుకోవడం, కాలేజీ వారీగా డీపీసీ జాబితాలను విడుదల చేయడం, రాష్ట్రవ్యాప్త ఖాళీల జాబితా ఇవ్వడం, ఎంపికల అవకాశాలు కల్పించడం, సూపర్ స్పెషాలిటీల కోసం హైదరాబాద్‌ను కూడా చేర్చడం వంటి అంశాలన్నీ కీలక మార్పులు అంటూ అభినందనలు తెలిపారు.
Also Read: Salaries Delay: నిధులు ఉన్నా చెల్లింపుల్లో జాప్యం.. మూడు నెలలుగా ఉపాధి సిబ్బంది నిరీక్షణ