Aadi Srinivas: సినిమా పరిశ్రమ పైన మాజీ మంత్రి హరీశ్ రావు చిలుక పలుకులు పలుకుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రీమియర్ షో విషయంలో ఏదో జరుగుతున్నదనే భ్రమలో ఉన్నారని ఫైరయ్యారు. సినిమా పరిశ్రమ పచ్చగా ఉండడం చూడలేక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. పదేళ్లలో చిత్ర పరిశ్రమను పట్టించుకోని బీఆర్ఎస్(BRS) నాయకులు ఇప్పుడు విచిత్రంగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. రాచకొండ గుట్టలో ఫిలిం సిటీ కట్టిస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్, పదేళ్ల పాటు చిన్న రాయి కూడా తీయలేదన్నారు. నంది అవార్డులను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్‌దని మండిపడ్డారు.
సంక్షేమం కోసం అనేక పథకాలు
ఉద్యమ సమయంలో తెలుగు చిత్ర నటులను ఎలా అవమానించారో ప్రజలందరికీ తెలుసునని గుర్తు చేశారు. ఇవన్నీ మర్చిపోయి హరీశ్ రావు ఇప్పుడు మంగళ హారుతులిస్తున్నారని ఎద్దేవా చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సినిమా కార్మికులతో సమావేశమైన మొదటి సీఎం రేవంత్ రెడ్డి అని, వాళ్ల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రకటించారని వివరిచారు. పదేళ్లలో అనేక ప్రీమియర్ షో లకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని శ్రీనివాస్ గుర్తు చేశారు. హీరోలు, నిర్మాతల ప్రయోజనం కోసమే కేసీఆర్, కేటీఆర్ ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చారని అన్నారు. తమ ప్రభుత్వం నటులు, నిర్మాతలను కాపాడుకుంటూనే కార్మికుల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నదని తెలిపారు. ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు వాటి ద్వారా వచ్చే డబ్బులో 20 శాతం కార్మికుల సంక్షేమ నిధికి వెళ్లేలా జీవో ఇచ్చామని చెప్పారు.
Also Read: KTR: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం: కేటీఆర్
గద్దర్ పేరుతో సినిమా..
సినిమా కార్మికులకు ఆరోగ్య భద్రత కార్డులు మంజూరు చేస్తున్నామని, వాళ్ల పిల్లల కోసం ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, జీతభత్యాలు పెరగడానికి నిర్మాతలతో చర్చలు జరిపాని తెలిపారు. ‘‘మీకు సినిమా వాళ్ల గెస్ట్ హౌస్‌లు, ఫిలిం ఫంక్షన్లు మాత్రమే తెలుసు. మా ముఖ్యమంత్రికి సినిమా కార్మికుల కష్టాలు తెలుసు. ప్రీమియర్ షోలకు అనుమతి విషయంలో నిబంధనల ప్రకారం ప్రభుత్వం నడుచుకుంటుంది. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. తెలుగు సినిమా పరిశ్రమను ఎలా ముందుకు తీసుకెళ్లాలో మా ముఖ్యమంత్రికి తెలుసు. కార్మికుల సంక్షేమమే పరమావధిగా మా సీఎం ముందుకు వెళ్తున్నారు. గద్దర్ పేరుతో సినిమా అవార్డులను మా ప్రభుత్వం తీసుకువచ్చింది. ఫోర్త్ సిటీలో ఫిలిం సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సినిమా కార్మికులు బీఆర్ఎస్‌కు ఓట్లు వేయలేదన్న అక్కసుతో హరీశ్ రావు మాట్లాడుతున్నారు. ముందు మీ ఇంట్లో సినిమా గురించి ఆలోచించు. లేకుంటే నీ కథ క్లైమాక్స్‌కు చేరుకుంటుంది’’ అని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
Also Read: Vijay Deverakonda: ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. చిరు సినిమాకైనా గుర్తించినందుకు హ్యాపీ!

