Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తామనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే ప్రభుత్వం జీవో 9 విడుదల చేస్తూ 23శాతం రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నది. హైకోర్డు నిర్ణయం ప్రభుత్వానికి సానుకూలంగా వస్తే ప్రస్తుతం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే పాత పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. అప్పుడు ఎన్నికల సంఘం తిరిగి రీ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌లో మార్పు లేదు
రంగారెడ్డి(Rangareddy), వికారాబాద్(Vikarabad) జిల్లాలో ప్రకటించిన రిజర్వేషన్లల్లో ఎస్సీ(SC), ఎస్(ST)టీలల్లో మార్పు ఉండదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు జరిగితే రిజర్వేషన్లల్లో మార్పులుండవు. కానీ బీసీలకు 42 శాతం కాకుండా 23 శాతం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే జనరల్ స్ధానాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రకటించిన బీసీ రిజర్వేషన్లలో చేర్పులు మార్పులుంటాయి. జెడ్పీటీసీ(ZPTC), ఎంపీపీ(MPP)లకు రంగారెడ్డి జిల్లాలో 21లో ఎస్టీలకు 3, ఎస్సీలకు 4, బీసీలకు 9, జనరల్ 5, వికారాబాద్ జిల్లాలో 20లో ఎస్టీలకు 2, ఎస్సీలకు 4, బీసీలకు 8, జనరల్ 6 చొప్పున ఖరారు చేశారు. ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ స్ధానాలను సైతం కేటాయించారు. అయితే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో ఏలాంటి మార్పు ఉండదు. పాత పద్దతి ప్రకారం బీసీలకు 23 శాతం రిజర్వేషన్లకు పరిమితం చేస్తే జనరల్ స్ధానాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎంపీటీసీల రిజర్వేషన్ కేటాయింపులో కూడా అదే తంతు కొనసాగుతుంది.
Also Read: Strange Incident: నా భార్య ఒక నాగిని.. రాత్రిళ్లు కాటు వేస్తోంది.. కలెక్టర్‌కు భర్త ఫిర్యాదు
ఆ స్థానాలకు రిజర్వేషన్లు పదిలం
ఇప్పటికే అధికారులు ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు యథావిధిగా ఉండనున్నాయి. జెడ్పీటీసీ(ZPTC)కి ఎస్టీ(ST), ఎస్సీ(SC)లకు రంగారెడ్డిలో మంచాల్, కోత్తూర్, ఫారూక్ నగర్, శంకర్ పల్లి, చేవెళ్ల, షాబాద్, కందుకూర్, వికారాబాద్ జిల్లాలో చౌడాపూర్, పెద్దెముల్, పూడూర్, కోట్పల్లి, వికారాబాద్, పరిగి ప్రాంతాలకే పరిమితం. ఎంపీపీ ఎస్టీ, ఎస్సీలకు కేటాయించిన రంగారెడ్డిలో కోత్తూర్, ఫారూక్ నగర్, తలకొండపల్లి, శంకర్ పల్లి, శంషాబాద్, చేవెళ్ల, షాబాద్. వికారాబాద్‌లో చౌడపూర్, పెద్దముల్, పూడూఊర్, కోట్పల్లి, వికారాబాద్, పరిగి మండలాల్లో మార్పులేదు. కానీ ఒకే మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీకి రిజర్వేషన్‌లో తేడా లేకపోవడంతో ఇతర వర్గాల నాయకులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇతరులకు అవకాశం లేకుండా జెడ్పీటీసీ, ఎంపీపీ ఒకే మండల పరిధిలో ఒకే వర్గానికి చెందిన రిజర్వేషన్లు ఇవ్వడంపై స్ధానికులు మండిపడుతున్నారు.
Also Read: MCMC Committee: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎంసీఎంసీ కమిటీ ఏర్పాటు
