CM Revanth Reddy: సీఎం రేవంత్‌తో గూగుల్ ప్రెసిడెంట్ భేటీ
CM Revanth Reddy (imaghecredit:twitter)
Telangana News

CM Revanth Reddy: సీఎం రేవంత్‌తో గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా సమావేశం.. కీలక రంగాల్లో సహకారంపై చర్చ..!

CM Revanth Reddy: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లలో భాగస్వామ్యం పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా (ఏపీఏసీ) ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో సమావేశమయ్యారు. వాతావరణంలో పెను మార్పులు, వ్యవసాయంపై దాని ప్రభావం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం వంటి సమస్యల పరిష్కారాలపై సమగ్రంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధి నమూనాను వివరించారు.

పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చ

కోర్ హైదరాబాద్‌ సిటీని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలను సీఎం వివరించారు. ట్రాఫిక్ కంట్రోల్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ ఇన్నోవేషన్‌కు మరింత మద్దతు వంటి రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలను ప్రస్తావించారు. తొలి గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకు గూగుల్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎరువులు అతిగా వినియోగించడం వల్ల ఏర్పడుతున్న సమస్యలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరంపై ఈ సమావేశంలో ప్రతినిధుల బృందం చర్చించింది. సమస్యల పరిష్కారానికి, మళ్లీ అవి తలెత్తకుండా నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Also Read: Jurala Project: జూరాల ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం వద్దకు వెళ్లిన మంత్రి శ్రీహరి

తెలంగాణకు పూర్తిగా సహకరిస్తాం..

గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లు, వాతావరణ మార్పు అంశాల్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో మద్దతు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీఎంతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విస్తృత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, బీఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలాతో భాగస్వామ్యం, ఏఐ పాఠ్యాంశాల అమలును ప్రధానంగా ప్రస్తావించారు. ప్రభుత్వం పాఠశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా, టీ ఫైబర్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నదని వివరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Also Read: Women Empowerment: మహిళల స్వావలంబనే.. కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం.. మంత్రి దామోదర రాజనర్సింహ

Just In

01

Traffic Challans: ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు సీరియస్.. చలాన్లు కట్టాలని బలవంతం చేయవద్దు..!

Urea App: యూరియా కోసం ఒక యాప్.. ఆర్గానిక్ పంటలకు మరో యాప్: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Phone Tapping Case: ఆ కీలక నేత ఎవరో నాకు తెలియదన్న హరీష్ రావు.. త్వరలో మరికొందరికి నోటీసులు

CM Revanth Reddy: తెలంగాణతో భాగస్వామ్యం కోసం ముందుకొచ్చిన ఎక్స్‌పర్టైజ్, అలోన్ స్టోపెల్ ప్రతినిధులు

Hyderabad GCC: హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుకు తమ సంస్థ సానుకూలం: విల్లెమ్ ఉయిజెన్