Kaleshwaram project (imagecredit:twitter)
తెలంగాణ

Kaleshwaram project: కాళేశ్వరం నివేదికపై సర్వత్రా ఉత్కంఠ.. విచారణకు కేసీఆర్ అవసరం లేదు!

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ తుది దశ విచారణ సైతం దాదాపు ముగిసింది. ఈ నెల మూడో వారంలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నది. కమిషన్ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టును సైతం స్టడీ చేసింది. ఇప్పటివరకు ఇంజినీర్లను, నిర్మాణ సంస్థలను విచారించింది. వారి నుంచి అఫిడవిట్లను కమిషన్ స్వీకరించింది. ప్రభుత్వానికి కమిషన్ తుది రిపోర్ట్‌ను ఇవ్వబోతున్నది. 400 పేజీల రిపోర్ట్‌ను కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ సిద్ధం చేశారు. కమిషన్‌కు ఎన్‌డీఎస్‌ఏ ఫైనల్ రిపోర్ట్‌ను సైతం స్టడీ చేసింది.

కమిషన్ రిపోర్టు అంతా పూర్తిచేసిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్‌ను, మాజీ మంత్రులు హరీశ్‌ రావును, ఈటల రాజేందర్‌ను సైతం పిలుస్తారని ప్రచారం జరిగింది. వారికి నోటీసులు ఇచ్చి, స్టేట్ మెంట్‌ను తీసుకోవాలని కమిషన్ భావిస్తున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. కానీ, ప్రస్తుతం వాళ్లను విచారణకు పిలువడం లేదని, బహిరంగ విచారణ పొలిటికల్ లీడర్లను పిలువొద్దని కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం జల సౌధాలో కమిషన్ చైర్మన్ ఘోష్ చిట్ చాట్ చేశారు.

Also Read: Konda Surekha: ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతున్న మంత్రి వ్యాఖ్యలు.. కారణం అదేనంటారా!

ఈ నెల 30తో కమిషన్ గడువు ముగింపు.

లీగల్ సమస్యలు రాకూడదని కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌ను విచారణకు పిలువొద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో కేసీఆర్, హరీశ్ రావు, ఈటలకు ఊరట లభించినట్లు అయింది. డాక్యుమెంట్ ఆధారాలతో ఫైనల్ రిపోర్ట్ కమిషన్ ప్రభుత్వానికి ఇవ్వనుంది.మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌ల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను నియమించింది. వందరోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది.

అయితే, గడువులోకా విచారణ పూర్తి కాకపోవడం, నివేదిక సైతం తయారు కాకపోవడంతో కమిషన్ గడువును పొడిగిస్తూ వచ్చింది. ఈ నెల 30తో కమిషన్ గడువు ముగియనున్నది. ఈ మూడు బ్యారేజ్‌లపై విచారణ ప్రారంభించిన కమిషన్ నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల నివేదికను సైతం పరిశీలించడంతో పాటు కాగ్ అభ్యంతరాలను సైతం స్టడీ చేసింది. నిబంధనల ఉల్లంఘన, ఏయే సంస్థల నుంచి ఎలా అప్పులు తెచ్చారు.. డిజైన్ ఫైనల్ చేసిందెవరునే కీలక అంశాలపైనా చర్చించింది. ఈ నెలాఖరున ప్రభుత్వానికి నివేదిక కమిషన్ అందజేయనున్నట్లు సమాచారం.

Also Read: Konda Reddy: కల్తీ విత్తన కంపెనీలపై చర్యలు.. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి!

 

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్