GHMC-Google
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

GHMC: గూగుల్‌‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న జీహెచ్ఎంసీ

GHMC: జెనరేటివ్ ఏఐ హైదరాబాద్‌

పౌర కేంద్రీకృత జెన్ ఏఐ ప్రాజెక్ట్‌పై జీహెచ్ఎంసీ కసరత్తు

అడ్వాన్స్‌డ్ పౌర సేవల నిర్వహణ
గూగుల్ భాగస్వామ్యంతో త్వరలోనే జనరేటివ్‌ ఏఐ పైలట్‌ ప్రాజెక్టు

తెలంగాణ బ్యూరో,స్వేచ్ఛ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, హైదరాబాద్ మహానగరవాసులకు అడ్వాన్స్‌డ్ పౌర సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీ (GHMC) సిద్దమైంది. నగర పరిపాలన, అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ సోమవారం గూగుల్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలో ఉన్న ప్రధాన పౌర సమస్యలను పరిష్కరించడానికి, పౌర సేవలను మెరుగుపరచడానికి అత్యాధునిక జెన్ ఏఐ (జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ కంటే అడ్వాన్స్) ఆధారిత పైలట్‌ ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మహానగరాన్ని జనరేటివ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో జీహెచ్ఎంసీ చేపట్టనున్న ఏఐ పైలట్ ప్రాజెక్టు ఒక ముందడుగుగా భావించవచ్చు. సోమవారం సాయంత్రం ఈ ప్రాజెక్ట్‌ ఆచరణపై చర్చించేందుకు పురపాలక శాఖ కార్యదర్శి డా. కే.ఇలంబరితి, కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, అదనపు కమిషనర్ (ఐటీ, రెవెన్యూ) అనురాగ్ జయంతి కలిసి గూగుల్ క్లౌడ్ ప్లాట్ ఫామ్ బృందంతో గూగుల్‌ మీట్‌ ద్వారా వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. జనరేటివ్‌ ఏఐ పైలట్‌ ప్రాజెక్ట్‌ భవిష్యత్‌ టెక్‌ ఆధారిత పరిష్కారాలను కొనుగొని, స్మార్ట్‌ , పౌర సమస్యలపై సత్వరమే స్పందించే నగర పాలన, జీహెచ్ఎంసీ ఆదాయ మార్గాలను సక్రమంగా సద్వినియోగం చేసుకునే అంశాలపై జీహెచ్ఎంసీపై దృష్టి సారించనుంది.

Read also- Weight Loss: 7 నెలల్లో 35 కేజీల బరువు తగ్గిన మహిళ… ఆమె చెప్పిన సీక్రెట్స్ ఇవే

జెనరేటివ్ ఏఐ ఆధారిత కీలక అంశాలు
ఏఐ ఆధారిత ప్రభుత్వ, పౌర సేవల నిర్వహణ, ప్రభుత్వ వెబ్‌సైట్ల కోసం జనరేటివ్‌ ఏఐ సెర్చ్‌ బార్, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కన్వర్సేషనల్‌ చాట్‌ బాట్‌లు, ఏఐ సెర్చ్‌ టూల్స్‌, పౌరుల ఫిర్యాదులు, అర్జీలు, విన్నపాల వర్గీకరణ ముఖ్యమవుతాయి. అదేవిధంగా గవర్నమెంట్ టు సిటిజన్ సేవల కోసం బ్లాక్‌‌చెయిన్‌ ఆధారిత ధృవీకరణ క్రెడెన్షియల్స్‌, ఏఐ ఆధారిత టెండర్‌ మూల్యాంకన వ్యవస్థ, స్మార్ట్‌ పార్కింగ్‌ నిర్వహణ, మరింత సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ, వివిధ రకాల పౌర దరఖాస్తుల కోసం ఆటోమేటెడ్‌ ఫారమ్‌ ఫిల్లింగ్‌,గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా పబ్లిక్‌ బస్సుల రియల్‌-టైమ్‌ ట్రాకింగ్‌, రోడ్‌ సేఫ్టీ, ట్రాఫిక్‌ మోడల్స్‌, కంప్లైంట్‌ హెల్త్‌ రికార్డుల కోసం గూగుల్‌ క్లౌడ్‌, నగర వ్యాప్తంగా హెల్త్ అనాలిటిక్స్ ప్లాట్‌ఫామ్‌, కీటక జనిత వ్యాధుల నివారణ, సత్వర వైద్య సేవలు, చెరువుల్లో చెత్త, శిథిలాల నిర్వహణను సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆశా వర్కర్ల కోసం ‘మాన్య’ ఏఐ అసిస్టెంట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

Read Also- India Win: మాంచెస్టర్ టెస్టులో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. సిరీస్ సమం

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ