Revanth Gaddar
తెలంగాణ

Gaddar Awards: గద్దర్ అవార్డ్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Gaddar Awards: హాలీవుడ్, బాలీవుడ్ ఈ గడ్డమీద పుట్టాలి, మీకు ఏం కావాలో అడగండి అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ప్రణాళికలు రూపొందించండి, మీకు ఏం కావాలో చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా, అది మీ అభివృద్ధి కోసమేనని వెల్లడించారు. హైటెక్స్ వేదికగా గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి 1964లో నంది అవార్డులు ఇవ్వాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నదన్నారు. ఆ అనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిందన్నారు.

మరో 22 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదకొండేళ్ల తర్వాత గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తున్నామన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ (Hyderabad) వేదికైందన్నారు. మరో 22 ఏండ్లు క్రియాశీల రాజకీయాల్లో తాను ఉంటానని స్పష్టం చేశారు. ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ఉంటుందన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఎకానమీని 3 మిలియన్ డాలర్లకు చేరుస్తామన్నారు. ‘గద్దరన్న అంటే ఒక విప్లవం, ఒక వేగుచుక్క. గద్దరన్న మాకు ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే మేం పోరాటాలు చేశాం’ అని అన్నారు.

మీ సహకారం ముఖ్యం

తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరారు. తెలంగాణ అభివృద్ధిలో గద్దరన్న స్ఫూర్తి ఉంటుందన్నారు. 11 ఏళ్లుగా సినిమాలు తీసినవారిని అభినందించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమ అంతా ఒక్కటే అని ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందజేస్తున్నామని చెప్పారు. దేశంలోనే ప్రపంచంలోనే అద్భుతమైన దేశంగా అభివృద్ధి చెందాలి, ఫిలీం ఇండస్ట్రీగా దేశంలో గొప్పగా రాణించాలని కోరారు. తెలుగు సినీ పరిశ్రమ అంటే తెలంగాణ అని చాటిచెబుతున్నందుకు అభినందనలు తెలిపారు. సినీ పరిశ్రమను ఎప్పుడు గౌరవిస్తుంది అన్ని వసతులు కల్పిస్తుందన్నారు.

Read Also- Hyderabad News: హెచ్ సిటీ పనులకు బ్రేక్.. ఎందుకంటే?

అట్టహాసంగా అవార్డుల కార్యక్రమం

అవార్డుల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సినీ ప్రముఖులంతా తరలివచ్చారు. 14 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడంతో తెలంగాణకు కొత్త అధ్యాయనానికి తెరదీసింది. పాటలు, డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. అవార్డుల కార్యక్రమం అద్వితీయంగా కొనసాగింది. ఎన్టీఆర్ నేషనల్ ఫిలీం అవార్డు నందమూరి బాలకృష్ణ, పైడి జయరాజ్ ఫిలీం అవార్డు మణిరత్నం, బీఎన్ రెడ్డి ఫిలీం అవార్డు సుకుమార్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అట్లూరి పూర్ణ చంద్రరావు, కాంతారావు ఫిలీం అవార్డు విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య ఫిలీం అవార్డు యండమూరి వీరేంద్రనాధ్.

ఫీచర్ ఫిలిమ్స్ అవార్డులు

కల్కీ(ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలీం), పొటేల్(సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలీం), లక్కీ భాస్కర్(థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలీం), కమిటీ కుర్రోళ్లు( టైటిల్ ఆప్ ద ఫిలీం), 35 చిన్న కథ కాదు(టైటిల్ ఆప్ ది ఫిలీం), రజాకార్(టైటిల్ ఆప్ ది ఫిలీం), హాయ్ మేము ఫ్రెండ్స్ అండి(టైటిల్ ఆప్ ది ఫిలీం) వివిధ రంగాల్లో అవార్డులు అందజేశారు.

Read Also- Anirudh Ravichander: ‘సన్ రైజర్స్’ కావ్య పాపతో అనిరుధ్ పెళ్లి.. మ్యాటర్ ఇదే?

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు