Gaddam Prasad Kumar: కాంగ్రెస్ ప్రభుత్వంలో గవర్నర్ గా నియామకమై బీజేపీ ప్రభుత్వంలోనూ కొనసాగిన అరుదైన వ్యక్తులలో రోశయ్య ఒకరు. ఆయన తో రాజకీయ విభేదాలు ఉండవచ్చు కానీ వ్యక్తిగతంగా అందరికీ ఆజాత శత్రువు రోశయ్య అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో గురువారం మాజీ సీఎం రోశయ్య 4వ వర్ధంతి నిర్వహించారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావును సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ నిండైన తెలుగు తనానికి ప్రతిరూపం రోశయ్య అని కొనియాడారు.
Also Read: Gaddam Prasad Kumar: శారీరక వ్యాయామమే కాదు.. ఒక జీవన విధానం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
రోశయ్యని ఆదర్శంగా తీసుకోవాలి
చట్టసభల గౌరవాన్ని పెంపొందించడంలో రోశయ్య కృషి మరవలేనిదన్నారు. ఆయన నుంచి నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని, నేటి యువ రాజకీయ నాయకులు రోశయ్యని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశంలో ఒక రాష్ట్ర ఆర్ధికమంత్రిగా అత్యధికంగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా రోశయ్య దే అన్నారు. ఈ కార్యక్రమంలోమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్సీ దయానంద్, నాయకుడు జగ్గారెడ్డి, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు.
Also Read: Gaddam Prasad Kumar: ఉభయ సభలు సజావుగా సాగాలి.. అసెంబ్లీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు!

