Odisha Encounter: నరిగ్ ఝెల్లా అడవుల్లో ఎన్‌కౌంటర్
మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయిక
గణేష్ స్వస్థలం తెలంగాణ రాష్ట్రం
మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు
రంపా, ఒడిస్సా, స్వేచ్ఛ: మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని కంధమాల్, గంజాం జిల్లాల సరిహద్దుల్లో గురువారం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ (Odisha Encounter) జరిగింది. ఈ ఘటనలో నలుగురు నక్సల్స్ మృతిచెందారు. అందులో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళామావోయిస్టులు ఉన్నట్టు గుర్తించారు. కంధమాల్ జిల్లా చకపడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరిగ్ ఝోల్లా అడవుల్లో చేపట్టిన ఈ జాయింట్ ఆపరేషన్‌లో ఎస్‌వోజీ, సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. మావోయిస్టులతో భీకరమైన ఎదురు కాల్పులు జరిపాయి. 2025 డిసెంబర్ 25న ఉదయం 9 గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి.
Read Also- School Bus Accident: మరో ఘోర ప్రమాదం.. స్కూల్ బస్సు బోల్తా.. 60 మందికి పైగా విద్యార్థులు..!
అగ్రనేత గణేష్ ఉయికే మృతి
మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన, సీపీఐ(మావోయిస్ట్) ఒడిశా ఇన్‌ఛాచార్జ్ గణేష్ ఉయికె (69 ఏళ్లు) ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఈయనను బుక్కా హనుమంతు అని కూడా పిలుస్తారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన ఈయన, ఒడిశా రాష్ట్రంలోని మావోయిస్ట్ పార్టీ కమిటీకి ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు. ఇతని మీద ఏకంగా రూ.1.10 కోట్ల రివార్డు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించాయి. మృతి చెందిన మిగతా ముగ్గురి గుర్తింపు ప్రక్రియ ఇంకా జరుగుతోందని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు అయ్యుండొచ్చని విశ్వసనీయంగా తెలుస్తోంది. మృతి చెందిన మావోయిస్టుల నుంచి ఇన్సాస్ రైఫిల్స్, ఒక .303 రైఫిల్, రివాల్వర్, వాకీ-టాకీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో సెక్యూరిటీ ఫోర్సెస్‌కు ఎలాంటి నష్టం సంభవించలేదు. కూంబింగ్ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
Read Also- Wife Extramarital affair: పెళ్లైన 4 నెలలకే బయటపడ్డ భార్య ఎఫైర్.. ఫ్లెక్సీ వేయించి భర్త న్యాయపోరాటం!
గణేష్ నేపథ్యం ఇదే
ఒడిశా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న గణేష్ ఉయికె తెలంగాణకు చెందినవారు. జగిత్యాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన నేపథ్యం విషయానికి వస్తే, ఈయనపై పెద్ద సంఖ్యలోనే కేసులు ఉన్నాయి. ఒడిశా అడవుల్లో మావోయిస్టుల రిక్రూట్‌మెంట్, ఆయుధాల చేరవేత, పోలీస్ ఆపరేషన్లకు వ్యతిరేకంగా పనిచేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్-ఒడిశా ట్రైబోర్డర్ రీజియన్‌లో ఆయన ప్రభావం ఎక్కువ చూపించారు. బొక్క హనుమంతు తెలంగాణ ప్రాంతంలోని వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాల సమీపంలో ఆయన గతంలో కార్యకలాపాలు నిర్వహించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీకి ఆకర్షితులైన నక్సల్స్‌లో చేరారు. నాటి నుంచి క్రియాశీలకంగా పనిచేశారు. కాగా, ఒడిశా మావోయిస్ట్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నారు. లెఫ్ట్-వింగ్ ఎక్స్‌ట్రెమిజం కేసుల్లోనూ ఆయన పేరు చాలాసార్లు వినిపించింది.

