Google Search Trends 2025: గూగుల్ సెర్చ్ లో టాప్ హీరో ఎవరంటే?
2025-top-heros
ఎంటర్‌టైన్‌మెంట్

Google Search Trends 2025: గూగుల్ సెర్చ్ 2025లో అత్యధికంగా సెర్చ్ అయిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?..

Google Search Trends 2025: ప్రతి ఏటా గూగుల్ విడుదల చేసే సెర్చ్ ట్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. అయితే 2025 సంవత్సరానికి సంబంధించి టాలీవుడ్ హీరోల విషయంలో ఒక సంచలన రికార్డు నమోదైంది. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గూగుల్‌లో అత్యధికంగా వెతికిన తెలుగు నటుడిగా అగ్రస్థానంలో నిలిచారు. గత ఏడాది కూడా ఆయన మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఈ ఏడాది ‘వారణాసి’ గ్లోబల్ రేంజ్ లో పాపులర్ అయిన మహేష్ బాబు కూడా వెనక్కి నెట్టి అల్లు అర్జున్ మాత్రమే మొదటి స్థానంలో నిలిచారు. దీనిని చూసిన అల్లు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అట్లీ సినిమా దేశంలోనే భారీ బడ్జెట్ పెట్టి నిర్మించే సినిమాల్లో ఒకటిగా ఉంది. అయితే ఇప్పుడు ఇలా ప్రపంచ స్థాయిలో కూడా ఆయన టాప్ లో ఉండటంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

Read also-Akhanda 2 JajiKayi Song: బాలయ్య బాబు ‘అఖండ 2’ నుంచి ‘జాజికాయ’ ఫుల్ సాంగ్ వచ్చేసింది..

1. అల్లు అర్జున్: సరికొత్త రికార్డు
2025 సంవత్సరంలో అల్లు అర్జున్ పేరు గూగుల్‌లో మారుమోగిపోయింది. దాదాపు 1.38 కోట్ల (13.80 million) సెర్చ్‌లతో ఆయన మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

కారణం: ‘పుష్ప 2’ సాధించిన భారీ విజయం, బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఆయన్ని గ్లోబల్ స్టార్‌గా నిలబెట్టాయి. కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియా, విదేశాల్లో కూడా ‘పుష్ప’ క్రేజ్ ఆయన సెర్చ్ వాల్యూమ్‌ను అమాంతం పెంచేసింది.

2. ప్రభాస్: పాన్-ఇండియా కింగ్
వరుసగా భారీ చిత్రాలతో అలరిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచారు. ‘కల్కి 2898 AD’ తర్వాత ఆయన చేయబోయే ‘ది రాజా సాబ్’, ‘స్పిరిట్’ వంటి చిత్రాలపై ఉన్న భారీ అంచనాలు ఆయన్ని ట్రెండింగ్‌లో ఉంచాయి.

3. మహేష్ బాబు: గ్లోబల్ స్టార్ రేంజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు.

విశేషం: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో ఆయన చేయబోయే అడ్వెంచరస్ సినిమా (SSMB29) పై గ్లోబల్ స్థాయిలో ఆసక్తి నెలకొనడం దీనికి ప్రధాన కారణం.

4. పవన్ కళ్యాణ్: పవర్ అండ్ పాలిటిక్స్
టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాల్గవ స్థానంలో నిలిచారు.

అటు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే, ఇటు ‘హరి హర వీరమల్లు’, ‘OG’ వంటి చిత్రాలతో వార్తల్లో నిలవడం వల్ల నెటిజన్లు ఆయన గురించి విపరీతంగా సెర్చ్ చేశారు. గత ఏడాది పవన్ రెండో స్థానంలో నిలిచారు.

Read also-Allu Arjun: మళ్లీ అల్లు అర్జున్‌తోనే ‘గాడ్ ఆఫ్ వార్’.. త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీపై క్లారిటీ!

5. జూనియర్ ఎన్టీఆర్: దేవర మేనియా
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఐదవ స్థానంలో నిలిచారు.

‘దేవర’ చిత్రం సాధించిన విజయం మరియు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘వార్ 2’ సినిమా అప్‌డేట్స్ తారక్ క్రేజ్‌ను గ్లోబల్ లెవల్‌లో నిలబెట్టాయి.

ఈ జాబితాను బట్టి చూస్తే టాలీవుడ్ హీరోల ప్రభావం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని స్పష్టమవుతోంది. వీరితో పాటుగా రామ్ చరణ్, విజయ్ దేవరకొండ కూడా సెర్చ్ లిస్ట్‌లో అయిదు, ఆరు స్థానాల్లో ఉన్నారు.

Just In

01

Wife Extramarital affair: పెళ్లైన 4 నెలలకే బయటపడ్డ భార్య ఎఫైర్.. ఫ్లెక్సీ వేయించి భర్త న్యాయపోరాటం!

Galaxy Watch: గెలాక్సీ వాచ్ వినియోగదారులకు శుభవార్త..

Pawan Kalyan: పవన్ ఖాతాలో మరో ఘనత.. ఏపీకి జాతీయ స్థాయిలో నెంబర్ 1 ర్యాంక్

Tollywood Flops: 2025లో నిర్మాతలను నిండా ముంచేసిన టాలీవుడ్ టాప్ టెన్ సినిమాలు ఇవే?..

Maoist Encounter: భారీ ఎన్ కౌంటర్.. టాప్ తెలుగు మావోయిస్టు నేత హతం