MLA Putta Madhukar: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ కుట్రలు, వస్తావాల పై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సి సిరికొండ మధుసూదన చారి, జలవనరుల మండలి మాజీ చైర్మన్ వీరమళ్ళ ప్రకాష్,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే లు, మాజీ జడ్పీ చైర్మన్ లు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
మాజీ స్పీకర్ మధుసూదన చారి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జలవనరుల మండలి మాజీ చైర్మన్ వీరమళ్ళ ప్రకాష్, మాజీ ఎమ్మెల్యే లు పుట్ట మధు, కోరుకంటి చందర్, విద్యాసాగర్ రావు, దివాకర్ రావు లు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ను కాంగ్రెస్ ను నిర్వీర్యం చేస్తుందని, కేసిఆర్ పై కుట్రను ప్రజల మీద చూపెట్టవద్దని, కాంగ్రెస్ కళ్ళు తెరువాలని అన్నారు.
Also Read: Govt land: క్రీడా మైదానం కాపాడినవాళ్లే నిందితులుగా? ఇది ఎలా న్యాయం?
గోదావరి ని చుసిన సంతోషపడ్డ వాళ్ళం ఇప్పుడు ఎండిన పరిస్థితి చూసి బాధ పడుతున్నాము. ప్రస్తుతం 1800 క్యూసెక్కు ల నీరు వృధాగా సముద్రం లో కలుస్తుంది. తెలంగాణలో వేల ఎకరాలకు, లక్షల మంది ప్రజలకు సాగు, తాగు నీరు అందించిన ప్రాజెక్టు కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ఎడారిని తలపిస్తుంది. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు 40 వేల ఎకరాలకు నీరు అందించాలన్నా మెడిగడ్డ బ్యారేజ్ ను పునరుద్దరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కుంగిన ఫిల్లర్ ను సాకు చూపి ప్రాజెక్ట్ ను ఎండబెడుతున్నారు. వెంటనే చిన్న కాళేశ్వరం భూసేకరణ నిలిపివేసి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్దరణ చేయాలనీ డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గొప్ప ప్రాజెక్టు..
18 నెలలు గడుస్తున్న NDSA ఏలాంటి నివేదిక ఇవ్వక కాలయాపన చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు లోని మూడు బ్యారేజ్ కూలినయని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కూలడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏదైనా చేస్తారని అన్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లు మంచిగానే వున్నా అవి కూడా కూలినయని కాంగ్రెస్ నాయకులు అనడం దారుణమని అన్నారు.
రాహుల్ గాంధీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై లక్ష కోట్లు అవినీతి జరిగిందని అనడంపై మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు లోని 203 కిలోమీటర్ల స్వరంగం నిర్మాణం ఎక్కడ లేదని ఈ ప్రాజెక్టు ఒక గొప్ప ప్రాజెక్టు అని కేసిఆర్ తొమ్మిది సంవత్సరాల్లో రైతుల కోసం అనేక పథకాలు తీసుకువచ్చి రైతుల ఆత్మహత్యలు ఆపాడని, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు నిజాంసాగర్ వరకు వెళ్లినయని అన్నారు. రైతులు ఏవరు కూడా కాళేశ్వరం నీళ్ల కోసం మూడు సంవత్సరాలు ఆశ పెట్టుకోవద్దని, రాబోయే రోజుల్లో రైతులల్లో చైతన్యం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పుతారని పేర్కొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు