Talasani Srinivas Yadav: ఇది దగా ప్రభుత్వం.. తలసాని శ్రీనివాస్
Talasani Srinivas Yadav (Image Source: Twitter)
Telangana News

Talasani Srinivas Yadav: ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. దగా ప్రభుత్వం.. మాజీ మంత్రి తలసాని

Talasani Srinivas Yadav: ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. దగా ప్రభుత్వం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీలకు రాజకీయం, విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. రెండేళ్లు అవుతున్నా అమలు చేయకుండా బీసీలకు తీరని మోసం, దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొదటి నుంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్దితో లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన కూడా పారదర్శకంగా జరగలేదని అసెంబ్లీలో ప్రభుత్వం అంగీకరించినది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సమాజంలో 50 శాతంకు పైగా ఉన్న బీసీలకు సర్పంచ్ ఎన్నికలలో 17.08 శాతం కేటాయించి అవమానిస్తారా? అని నిలదీశారు.

Also Read: CM Revanth Reddy: ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని తలసాని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు దమ్ముంటే పార్టీ పరంగా ఇస్తామన్న 60 శాతం రిజర్వేషన్ తో జాబితాను వారం రోజులలో ప్రకటించాలని సవాల్ చేశారు. బీసీలను నయవంచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెడతామని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా బీసీలు జిల్లాలలో మంత్రులు, కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తరహాలో మరో ఉద్యమం చేపడతామని, కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు వదలబోమని హెచ్చరించారు.

Also Read: India – Pakistan: అయోధ్యలో ధ్వజారోహణంపై పాక్ అక్కసు.. తీవ్రస్థాయిలో మండిపడ్డ భారత్

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?