Water Disputes: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల (Water Disputes) పరిష్కారం కోసం ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తొలిసారి భేటీ అవుతుంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ ఢిల్లీలోని సేవాభవన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం అవుతుంది. ఈ మీటింగ్ లో చర్చించేందుకు ఎలాంటి ఎజెండా ఖరారు కాలేదని సమాచారం. ఏయే అంశాలు చర్చించాలనే దానిపై కూడా స్పష్టత రాలేదని సమాచారం. కమిటీ సమావేశంలోనే ఏపీ ఏయే అంశాలు లేవనెత్తుతుందనేదానిపైనే తెలంగాణ సైతం బలంగా వాదనాలు వినిపించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే కమిటీ ప్రకటన చేసి నాలుగువారాలు గడుస్తున్నప్పటికీ తొలికమిటీ సమావేశంలో చర్చించే అంశాలపై క్లారిటీ రాలేదని సమాచారం.
Also Read: Water Disputes: తెలంగాణ ప్రతిపాదనలే ఎజెండాలో చేర్చాలి..
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ
కమిటీతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారం అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. అయితే ఆ కమిటీ ఏయే అంశాలపై చర్చించాలనేదానిపై ఎజెండా తయారు చేయలేదని ప్రచారం జరుగుతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అధికారుల మధ్య మన్వయలోపం కారణంగానే తొలిభేటిలో ఎజెండా ఖరారు కాలేదని సమాచారం. గతంలో సమీక్షల సందర్భంగా, ట్రిబ్యూనల్స్ ముందు ప్రస్తావించిన అంశాలనే ఈ భేటీలోనూ పెడతారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఏపీ పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ప్రసంగంలోనూ స్పష్టం చేసింది. అయితే ఆప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు సైతం వేగవంతం చేసింది. ఇప్పటికే సముద్రంలో కలిసే నీటినే వాడుకుంటామని నల్లమల్లసాగర్ తో తెలంగాణకు నష్టం లేదని వాదిస్తుంది. అయితే జలాల వివాదంపై వేసిన తొలి సమావేశం జరుగుతుండటతో ఏపీ లేవనెత్తబోయే అంశాలపై ఎలా గళం వినిపిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఏపీని ఎలా నిలువరిస్తారు?
ఇప్పటికే నాగార్జున సాగర్ కుడికాల్వనుంచి ఏపీ కేటాయించిన నీటి కేటాయింపులకంటే ఎక్కువగా వినియోగిస్తుంది. ఇదే విషయం తెలంగాణ సైతం పలు సందర్భాల్లోనూ పేర్కొంది. అయితే కృష్ణా, గోదావరి జలాల వాటాలు, గతంలో జరిగిన ఒప్పందాలు.. ప్రస్తుత పరిస్థితులు, ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ అధికారులు ఏస్థాయిలో తమగళం వినిపిస్తారు? రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వబోతున్నారు. ఏపీని ఎలా నిలువరిస్తారు? ఆ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఎలా అడ్డుకుంటారు? ఈ కమిటీలో ఎలాంటి వ్యూహాలను అనుసరించబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.
Also Read: Teachers Tragedy: ఉపాధ్యాయుల కారుకు ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి..!

