Miss World Contestants: తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన కొంతమంది పోటీ దారులు నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న బుద్ధవనంను సందర్శించనున్నారు. బుద్దవనంలో ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సుమారు 30 దేశాలకు చెందిన ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే పోటీదారులు సందర్శించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ జిల్లా, చింతపల్లి సమీపంలో ఉన్న అతిథి గృహం వద్ద కాసేపు ఆగుతారు.
అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విజయ్ విహార్ చేరుకుంటారు. అక్కడ ఫొటో సెషన్ తర్వాత బుద్ధవనం చేరుకుంటారు. సుమారు 24 మంది లంబాడా కళాకారులు నృత్యంతో వారికి స్వాగతం పలకనున్నారు. మహా స్థూపం వద్ద స్వాగతం అనంతరం స్థూపం కనిపించేలా ఫొటో సెషన్ ఉంటుంది. ఇందుకు గాను అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేశారు. అక్కడి నుంచి మహా స్థూపంలోకి ప్రవేశించిన తర్వాత మహా స్థూపానికి సంబంధించిన వివరాలను పురావస్తు శాఖ ప్రతినిధులు వివరించనున్నారు.
Also Read: Drugs: నమ్రత డ్రగ్స్ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు.. అవేంటంటే!
అక్కడే ప్రపంచ సుందరీమణులు ధ్యానం తర్వాత ఇక్కడే 25 మంది బౌద్ధ సన్యాసులు బైలికుప్ప మహా బోధి పూజలు నిర్వహిస్తారు. అనంతరం జాతక వనాన్ని సందర్శిస్తారు. బుద్ధవనం ప్రాముఖ్యతను పురావస్తు, టూరిజమ్ ప్రతినిధి శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. జాతక వనం సందర్శన అనంతరం బుద్ధ చరితం పై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి భోజనం అనంతరం తర్వాత తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.