Hyderabad City (Image Source X)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Cold Wave Weather: తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలి

Cold Wave Weather: తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న చలి

రానున్న మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రేటర్ హైదరాబాద్‌లోని వాతావరణం ఒక్కసారిగా (Cold Wave Weather) చల్లబడింది. క్రమంగా చలిపులి పంజా విసురుతోంది. ఇప్పటికే రాత్రి, తెల్లవారుజామున చల్లటి గాలులు వీస్తూ చలిగా ఉండటం మొదలైంది. శివార్లలో అయితే సాయంత్రం 4 గంటల నుంచే చలి వణికిస్తోంది. ఇక రానున్న మూడు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం హైదరాబాద్ నగర గరిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీలుగా నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలకు పడిపోయింది.

Read Also- Gold Shop Scams: బంగారం షాపులపై నిఘా ఏదీ?.. గుట్టుచప్పుడుకాకుండా ఏం చేస్తున్నారో తెలుసా?

ఈ ఉష్ణోగ్రతలు శుక్రవారం నుంచి క్రమంగా తగ్గుతూ ఆదివారం కల్లా చలి మరింత పెరిగే అవకాశముంది. శుక్రవారం నుంచి ఒక్కో డిగ్రీ మేర టెంపరేచర్లు తగ్గి క్రమంగా తక్కువగా నమోదు కానున్నట్లు అధికారులు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలకు పడిపోయే అవకాశముందన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం అయిదున్నర, ఆరు గంటల వరకు వేడిగానే ఉంటూ, సాయంత్రం 6 గంటల తర్వాత చలి గాలులు వీయనున్నాయి. ఈ రకంగా క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతూ కనిష్టంగా 13 డిగ్రీల నుంచి 14 డిగ్రీలకు తగ్గే అవకాశమన్నట్లు అధికారులు తెలిపారు. చలి ప్రభావం పెరుగుతుండటంతో శివారులోని పలు గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి ఎనిమిది గంటలకే చలిమంటలు వేస్తున్నారు. ఇక సిటీలో తప్పకుండా రాకపోకలు సాగించాల్సిన వాహనదారులు చలి నుంచి కాపాడుకునేందుకు స్వెట్టర్లు ధరించి, దర్శనమిస్తున్నారు.

Read Also- Bigg Boss Telugu 9: సీక్రెట్ రెబల్.. హౌస్‌లో అసలు సిసలు బిగ్ బాస్ ఆట మొదలైంది

Just In

01

Akhanda 2: బాలయ్య పాన్ ఇండియా ప్రచారంలో దూకుడేది.. ఇంకా అనుమానాలేనా?

Parasakthi: శ్రీలీలతో రెట్రో రొమాన్స్‌లో శివకార్తికేయన్‌.. ‘పరాశక్తి’ సాంగ్ అదిరింది

Ram Mohan Naidu: 52 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కేంద్రమంత్రి రామ్మోహన్ భేటీ.. ఎందుకంటే?

Rana Daggubati: కాలాన్ని రీ క్రియేట్ చేయగలిగేది ఒక్క సినిమా మాత్రమే!

Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!