FRS
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

FRS: తెలంగాణలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు కీలక అప్‌డేట్!

FRS: అమలు దిశగా ఉన్నత విద్యామండలి కసరత్తు

వీసీలతో శుక్రవారం కీలక భేటీ
ఇబ్బందులను అధిగమించడంపై ఫోకస్
ఇప్పటికే స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్‌లో అమలు
పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ యాజమాన్యాల డిమాండ్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఇప్పటివరకు స్కూల్ ఎడ్యుకేషన్, జూనియర్ కాలేజీల్లో అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్‌ను (FRS) ఇకనుంచి డిగ్రీ, పీజీలోనూ అమలుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కసరత్తు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు స్కూల్ ఎడ్యుకేషన్, జూనియర్ కాలేజీల్లో ఇంప్లిమెంట్ జరుగుతోంది. ఈ తరుణంలో ఉన్నత విద్యామండలి పరిధిలోకి వచ్చే అన్ని కాలేజీల్లోనూ దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం కీలక అడుగు పడనుంది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల వైస్ చాన్స్‌లర్లతో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎఫ్ఆర్ఎస్ అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా ఎదురయ్యే ఇబ్బందులు అధిగమించడంపై ఫోకస్ పెట్టనున్నారు.

Read Also- Kavitha: కవితను కలిసిన కేసీఆర్ సొంతూరి ప్రజలు.. ఎందుకో తెలుసా?

డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ అమలు చేయడంపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌లో శుక్రవారం అన్ని వర్సిటీల వీసీలతో బాలకిష్టారెడ్డి భేటీ కానున్నారు. ఎఫ్​ఆర్ఎస్‌ను 100 శాతం ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన మెకానిజమ్‌ను తీర్చిదిద్దడంపై దృష్టిసారించనున్నారు. అవసరమైతే అటెండెన్స్‌కు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అనుసంధానం చేసైనా విద్యార్థులు రెగ్యులర్‌గా వచ్చేలా చేయాలని భావిస్తున్నారు. అయితే, ఎఫ్ఆర్ఎస్ అమలు కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను ఉన్నత విద్యామండలి ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలావుంచితే, అధికారుల మీటింగులో ఎఫ్​ఆర్ఎస్‌తో పాటు అపార్, ఏబీసీ, డిజి లాకర్, స్టాఫ్ డేటాబేస్, స్టూడెంట్స్ డేటాబేస్ వంటి అంశాలపైనా చర్చించనున్నారు. వీటితో పాటు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపైనా చర్చించే అవకాశాలున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉన్నా కూడా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని ఎందుకు తీసుకొస్తున్నట్లు అనే అంశం అందరి మెదళ్లను తొలుస్తోంది. అందుకే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా తీసుకొస్తున్న బెస్ట్ ప్రాక్టీస్‌ను వివరించాలని ఉన్నత విద్యామండలి యోచిస్తున్నట్లు సమాచారం.

Read Also- Abhishek Sharma: రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ.. వరల్డ్ క్రికెట్‌లో తొలిసారి

డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నైజేషన్‌ను అమలు చేయడాన్ని ప్రైవేట్ యాజమాన్యాలు స్వాగతిస్తున్నాయి. కానీ, దానికి ఒక మెలిక పెడుతున్నాయి. పెండింగ్ బకాయిలను రిలీజ్ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. బకాయిలు రిలీజ్ చేస్తే తాము ఎఫ్ఆర్ఎస్‌ను ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలు ప్రైవేట్ యాజమాన్యాలు చెబుతున్నట్లుగా సమాచారం. ఎందుకంటే, బకాయిలు రిలీజ్ చేయకుంటే ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేసేదెలా? అని వారు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. బకాయిలు సకాలంలో అందకపోవడంతో ఇబ్బందులతో కళాశాలలు కొనసాగిస్తున్నట్లుగా చెబుతున్నట్లు వినికిడి. ఉన్నత విద్యామండలి పరిధిలో దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి అవసరమైనన్ని పరికరాలు కొనుగోలు చేసేందుకు పలు ప్రైవేట్ యాజమాన్యాలు పెండింగ్ బకాయిల మెలిక పెడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎఫ్ఆర్ఎస్ అమలు అనేది ముఖ్యమంత్రి ఆదేశాలు కావడంతో ఉన్నత విద్యామండలి సీరియస్‌గా ఈ అంశాన్ని తీసుకుంది. మరి దీని అమలుకు ప్రైవేట్ యాజమాన్యాలను ఎలా ఒప్పించనున్నారనేది ఆసక్తికరంగా మారనుంది.

Just In

01

DOST Admissions: ‘దోస్త్’ స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి కీలక అప్‌డేట్

Gadwal Court: గద్వాల కోర్టు వినూత్న తీర్పు.. జిల్లాలో ఇదే తొలిసారి

Coolie Monica Song: జుమ్ జుమ్ జుమ్‌తాక్.. ‘కూలీ’ మోనికా వీడియో సాంగ్ వచ్చేసిందోచ్..

Kavitha Politics: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటు చీల్చేందుకు కవిత మాస్టర్ ప్లాన్?

Chai Waala: ‘చాయ్ వాలా’ ‘సఖిరే..’ని చూశారా.. మెలోడీ అదిరింది