Hyderabad ( Image Source: Twitter)
తెలంగాణ

Hyderabad Police: రైల్వే స్టేషన్‌లో 32 కిలోల గంజాయి సీజ్

Hyderabad Police: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలులో కొందరు హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నారని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ‘బీ’ టీం సీఐ చంద్రశేఖర్ గౌడ్‌కు సమాచారం అందింది. ఈ సమాచారంతో సీఐ చంద్రశేఖర్ గౌడ్ ఎక్సైజ్ సిబ్బందితో పాటు ఆర్‌పీఎఫ్ పోలీసులతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు.

Also Read: Malegaon Case: మాలేగావ్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. బీజేపీ మాజీ ఎంపీ సహా అందరూ నిర్దోషులే

10వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఒక మూలన మూడు అనుమానాస్పద బ్యాగులు కనిపించాయి. అక్కడ ఎవరూ లేకపోవడంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా, ఆ బ్యాగుల్లో 19 ప్యాకెట్లలో గంజాయి దొరికింది. దీంతో అధికారులు ఆ గంజాయిని సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో ఆర్‌పీఎఫ్ సీఐ సరసర్వత్, ఎస్‌ఐ కరుణ్ మూర్తితోపాటు వి.రెడ్డి, వి.భూపాల్ తదితరులు పాల్గొన్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read: Sheep scheme Scam ED: గొర్రెల స్కాంలో ఈడీ దూకుడు..హైదరాబాద్‌లో 10 చోట్ల దాడులు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!