Phone Tapping Case: మాజీ సీఎం కేసీఆర్ కోసమే ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్((Etela Rajender) అన్నారు. ఎస్ఐబీ ఛీఫ్ గా పని చేసిన ప్రభాకర్ రావు(Prabhakar Rao) ఆయనకు తొత్తుగా పని చేశారని వ్యాఖ్యానించారు. ఇది బహిరంగ రహస్యమని చెప్పారు. అయినా, కేసు దర్యాప్తు నత్తనడకన నడుస్తోందన్నారు. దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) సూత్రధారులను బయట పెట్టేలా సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేసును సీబీఐకి (CBI)అప్పగించాలన్నారు. ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్(Jubilee Hills Police Station) లోని సిట్ కార్యాలయానికి వచ్చిన ఈటెల రాజేందర్ వాంగ్మూలం ఇచ్చారు.
ఉప ఎన్నికల ప్రచార సమయంలో
బయటకు వచ్చిన అనంతరం మీడియా(Media)తో మాట్లాడుతూ దేశ భద్రతకు భంగం కలిగించే వారిపై పెట్టాల్సిన నిఘాను తమపై పెట్టారన్నారు. నాయకులతోపాటు వారి వ్యక్తిగీ సిబ్బంది, కుటుంబ సభ్యులు, గన్ మెన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పారు. నిజానికి 2018లోనే తన ఫోన్లను ట్యాప్ చేయటం ద్వారా హుజూరాబాద్(Huzurabad) లో ఓడించాలని ప్రయత్నించారన్నారు. 2021లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల(By Elaction) ప్రచార సమయంలో ఆరునెలలపాటు తన ఫోన్ ను ట్యాప్ చేశారని చెప్పారు. తాను ఎవరెవరితో మాట్లాడుతున్నానో తెలుసుకుని వారిని బెదిరింపులకు గురి చేశారన్నారు. డబ్బు, పదవుల ఆశ చూపించి నన్ను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించారని చెప్పారు. గజ్వేల్, మునుగోడు ఎన్నికల సమయంలో కూడా పలువురు నాయకులు, వారి సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలిపారు.
Also Read: Praneeth Rao: వెలుగులోకి వస్తున్న ప్రణీత్ రావు లీలలు
ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉందా?…
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి నిజాయితీ ఉందా? అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. విద్యుత్తు కొనుగోళ్లపై వేసిన కమిషన్ ఏమైందో ఎవ్వరికీ తెలియదన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు(Kakleshwaram Commission Report) ఇప్పటికీ రాలేదని చెప్పారు. బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) ఒక్కటే అని చెప్ప సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) దీనికి సమాధానం చెప్పాలన్నారు. లోపాయికారీ ఒప్పందం లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసును ఎందుకు తూతూ మంత్రంగా నడిపిస్తున్నారన్నారు. ప్రభాకర్ రావు(Prabhakar Rao) డైరెక్ట్ ఐపీఎస్ అధికారి కాదు ప్రమోటీ అని చెప్పారు. ఏం చెబితే అది చేస్తాడనే ఆయనను నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఐబీ ఛీఫ్ గా నియమించారన్నారు. కేంద్రం ఆదేశాలను తుంగలో తొక్కి రిటైరయ్యాక కూడా ఆయనను కీలకమైన ఎస్ఐబీలో కొనసాగించారని చెప్పారు. బాధ్యతాయుతమైన పోస్టులో ఐపీఎస్(IPS) అధికారిని నియమించకుండా రిటైరైన ప్రభాకర్ రావును కొనసాగించటం వెనక ఉద్దేశ్యం తమ చెప్పు చేతల్లో ఉంటాడనే అని వ్యాఖ్యానించారు.
వాళ్లు ఈయన మీద చెబుతారు
ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు(Praneeth Rao), భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు(Radha Kishan Rao) తాము ప్రభాకర్ రావు ఏం చెబితే అది చేశామని చెబుతున్నారని ఈటెల రాజేందర్(Eetela Rajender) అన్నారు. ప్రభాకర్ రావు తాను ఇచ్చినవే కాకుండా వీళ్లంతా వేరే ఫోన్ నెంబర్లను ట్యాప్ చేశారని అంటున్నారన్నారు. దీంట్లో సినీ పరిశ్రమకు చెందిన వారితోపాటు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల ఫోన్లు ఉన్నట్టు తెలిపారు. ఓ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న ఇంద్రసేనా రెడ్డితోపాటు జడ్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయటం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. 1975లో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి దేశాన్ని జైలుగా మార్చి కొంతమందిని అడ్రస్ లేకుండా చేసిన చీకటి అధ్యాయాలు మళ్లీ ఈ రూపంలో కనిపిస్తున్నాయన్నారు.
నా భార్య ఫోన్ ను సైతం
జమునా హేచరీస్ నడుపుతున్న తన భార్య ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని ఈటెల రాజేందర్ చెప్పారు. సంస్థలో పని చేస్తున్న విక్రమ్ రెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, సతీష్, వేణుగోపాల్ రెడ్డి తదితర ఫోన్లను ట్యాప్ చేసి మాటలు రికార్డు చేసినట్టు తెలిపారు. వారి మధ్య జరిగిన సంభాషణలను ఈ రోజు సిట్ అధికారులు చూపించారన్నారు. తన భార్యతో మాట్లాడిన మాటలు కూడా రికార్డు చేశారని, ఇది అత్యంత నీచమైన చర్య అని వ్యాఖ్యానించారు.
Also Read: Mani Ratnam: మణిరత్నం సారీ చెప్పేశారు.. నెక్ట్స్ ఇచ్చిపడేస్తారట!
సమగ్ర విచారణ జరపాలి
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో విచారణను వేగవంతం చేయాలని ఈటెల రాజేందర్ అన్నారు. సమగ్ర విచారణ జరిపి ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశాడన్నది నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం బతకాలి, ప్రజల హక్కులను సురక్షితం చేయాలన్నారు. ఈ వ్యవహారంలోని దోషులు ఎంతటి వారైనా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యంపై, ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ దమ్ము లేకపోతే మేమున్నాం కేసును సీబీఐకి(CBI)) అప్పగించండి అని అన్నారు. ఎంతటి వారైనా దోషులు ఎవరన్నది తేల్చి శిక్షించే సత్తా సీబీఐకి ఉందని చెప్పారు.
బీజేపీని దెబ్బ తీసేందుకే
బీజేపీ(BJP)ని దెబ్బ తీసేందుకే కేసీఆర్(KCR) ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కు పాల్పడిందని బీజేపీ సీనియర్ నేత గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి(Premender Reddy) అన్నారు. సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ నేతల వ్యక్తిగత సంభాషణలు, జర్నలిస్టులు(Journalist), జడ్జిలు(Asdavcates), సినిమా వాళ్ల ఫోన్ కాల్స్ వినటం దారుణమని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితులు వేల సంఖ్యలో ఉండగా సాక్షులుగా కొద్దిమందిని మాత్రమే పిలుస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఎన్నికల్లో చాలా చోట్ల బీజేపీ(BJP) ఓటమి పాలైందన్నారు. ప్రభుత్వానికి చేతకాకపోతే కేసును సీబీఐకి అప్పగించాలన్నారు.