Errolla Srinivas: పోలీసు శాఖలో అసమర్థులకు కీలక పదవులు
Errolla Srinivas (imagecredit:swetcha)
Telangana News

Errolla Srinivas: రాష్ట్రంలో పోలీసు శాఖలో అసమర్థులకు కీలక పదవులు.. అందుకే గన్ కల్చర్..!

Errolla Srinivas: కెసిఆర్ పాలనలో ఉన్న అగ్రికల్చర్ పోయి.. కాంగ్రెస్ పాలనలో గన్ కల్చర్ వచ్చిందని తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్(Errolla Srinivas) అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రమంతా అవినీతిమయం అయ్యింది అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్ ,క్రైమ్ గా మారిందని ఆరోపించారు. రెండు సంవత్సరాల రేవంత్ పాలన లో రాష్ట్రం క్రైమ్ కు చిరునామా గా మారిందని, .కేసీఆర్(KCR) హయంలో తెలంగాణ అంటే శాంతికి చిరునామా.. లా అండ్ ఆర్డర్ లా పతా అయిందన్నారు. హోమ్ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పెరుగుతున్న క్రైమ్ రేట్ కు భాద్యత వహించాలని డిమాండ్ చేశారు. 2023 తో పోలిస్తే క్రైం రేటు 14 శాతం పెరిగిందని, 2025 లో వెయ్యి మర్డర్లు జరిగాయన్నారు. .పెట్టుబడులు పెట్టే వారు లా అండ్ ఆర్డర్ ను చూసి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. నాడు తెలంగాణ శాంతిభద్రతలకు ఆదర్శం.. నేడు సైబర్ క్రైమ్ లకు అడ్డాగా మారిందన్నారు.

ఫ్రెండ్లీ పోలీస్ పోయి వేధించే పోలీస్

బీఆర్ఎస్ సోషల్ మీడియా పై కేసులు పెట్టడం లో ఉన్న శ్రద్ధ నేరాల అదుపులో పెట్టి ఉంటే రాష్ట్రంలో శాంతి ఉండేదన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ పోయి వేధించే పోలీస్ అయ్యిందని, షీ టీంలు ఎక్కడ ఉన్నాయి? మహిళల పై వేధింపులు ఎక్కువయ్యాయి అని ఆరోపించారు. పొలీస్ శాఖలో అసమర్దుల కు కీలక పదవులు ఇవ్వడం వల్లే నేరాల సంఖ్య పెరుగుతోందని మండిపడ్డారు. నేరాల సంఖ్య 90 వేలను దాటిందని, ప్రజలను హతమార్చడం తప్ప రాష్ట్రం లో ప్రజాపాలన లేదు. పోలీసులను ఫోటో గ్రాఫర్లు, బిల్ కలెక్టర్లుగా మార్చారని ఆరోపించారు. రోజుకు 30 ఫోటోలు తీయాలి 30 చలాన్లు రాయాలి అనేది పోలీసుల పాలసీ గా మారిందన్నారు. చలానాల పేరుతో పేద మధ్యతరగతి ప్రజల రక్తాన్ని తాగుతున్నారు.

Also Read: West Bengal Voter’s: బెంగాల్‌లో రాజకీయ తుపాను.. ఓటర్ల జాబితాలో 58 లక్షల పేర్లు తొలగింపు

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

ఎక్సయిజు శాఖకు ఓ వైపు టార్గెట్లు పెడుతూ.. మరో వైపు 24 గంటలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడుతున్నారు. ఒకే ప్రభుత్వం రెండు విధానాలతో ముందుకు పోతోందన్నారు. పోలీస్ లకు ఆరోగ్య భరోసా ఎక్కడా అమలు కావడం లేదని, గ్లోబల్ సమిట్ గోబెల్స్ సమిట్ గా మారిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణ పై ద్రుష్టి సారించాలని, లేక పోతే బీఆర్ఎస్ ఆందోళనా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ నేతలు కె .కిషోర్ గౌడ్, ఇంతియాజ్ అహ్మద్, గోసుల శ్రీనివాస్ యాదవ్, కురువ విజయ్ కుమార్, గౌతమ్ ప్రసాద్, సత్యవతి పాల్గొన్నారు.

Also Read: Gadwal News: పంచాయతీ పోరులో గొంతు విప్పుతున్న యువగళం.. ఎన్నికల బరిలో నిలిచిన యువత

Just In

01

Corporator Shashikala: నా వార్డును పునర్విభజించే హక్కు మీకెవరిచ్చారు?: కార్పొరేటర్ శశికళ

IPL Auction 2026: అన్‌సోల్డ్ ప్లేయర్‌‌ని రూ.13 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎవరంటే?

Boyapati Sreenu: సెప్టెంబర్ 25కే మొదటి కాపీ రెడీ.. ‘ఓజీ’ కోసం బాలయ్యే ఆపమన్నారు

OU ACB Raid: ఏసీబీ వలలో చిక్కిన ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగి..?

Collector BM Santosh: పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో తేడా రావద్దు: కలెక్టర్ బి.ఎం.సంతోష్