Maha Dharna: ప్రభుత్వానికి టీజీఈ జాక్ డెడ్ లైన్ విధించింది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళన చేపడతామని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్స్ ఐక్య కార్యచరణ సమితి సుందరయ్య విజ్ఞాన భవన్ లో సదస్సు నిర్వహించారు. ఉద్యోగుల దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించారు. టీజీఈ జాక్ చైర్మన్ జగదీశ్వర్, సెక్రటరీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనత, అలసత్వంతో 13లక్షల 31వేల కుటుంబాలను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయన్నారు.
Also Read: Miss brazil in hyderabad: హైదరాబాద్ చేరుకున్న మరో అందాల రాణి.. ఎవరంటే?
యుద్దప్రతిపదికన పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని, 5 కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగల ఆరోగ్యం రక్షణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, సీపీఎస్ ను రద్దు చేయాలని, వేతన సవరణ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51 శాతం పిట్ మెంట్ తో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది మేలేదా జూన్ లో సాధారణ బదిలీలు చేయాలని కోరారు.
లేకుంటే ఈ నెల 15 నుంచి జిల్లా, రాష్ట్ర రాజధానిలో భోజన విరామ సమయంలోనల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేప్డతామన్నారు. జూన్ 9న ఇందిరా పార్కులో మహాధర్నా చేపడ్డతామన్నారు. మానహారాలు, సామూహిక బోజనాలు, రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్, పనివేలల్లో మాత్రమే పనిచేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాక్ నేతలు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు