Miss brazil in hyderabad: మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ వేదికైంది. హైదరాబాద్ లో జరుగనున్న మిస్- వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాల సుందరీమణులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. మిస్ బ్రెజిల్ జెస్సికా స్కేన్ద్రియుజ్య్ పెడ్రోసో ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. మిస్ బ్రెజిల్ కు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. కాగా, ఇప్పటికే మిస్ వరల్డ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయన్నా క్యాథరీన్ మొర్రిసన్ లు ఇప్పటికే చేరుకున్నారు.
Also Read: Hero Nani: హీరో నాని తలకు గాయం.. వైరల్ అవుతున్న ఫోటోలు
అంతర్జాతీయ వేదికపై తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మే 10 నుండి 31 వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న 72 వ మిస్ వరల్డ్ 2025 పోటీలను తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి తెలిపేలా, అంతర్జాతీయంగా తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ పెంచేలా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేసింది. మిస్ వరల్డ్ పోటీలను సువర్ణ అవకాశంగా మలుచుకొని పెద్ద ఎత్తున పెట్టుబడులు తెలంగాణకు ఆకర్షించేలా ప్రయత్నాలు చేస్తుంది.
ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే పోటీదారులు ముందస్తుగానే హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. అందులో భాగంగానే మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కాథరిన్ మోరిసన్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు నిన్న సాయంత్రం చేరుకోగా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు.
స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/