Jubilee Hills Bypoll: హీరోయిన్లకు ఓట్లు?.. ఎన్నికల అధికారి క్లారిటీ
Social-Media-Posts (Image source: Whatsapp)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Jubilee Hills Bypoll: ఒకే అడ్రస్‌తో తమన్నా, సమంత, రకుల్‌కు ఓట్లు?.. స్పందించిన ఎన్నికల అధికారి

Jubilee Hills Bypoll: దుమారం రేపుతున్న సోషల్ మీడియా పోస్టులు

ఈ తరహా పోస్టులపై దృష్టి పెట్టిన పోలీసులు
దుమారం రేపిన ఆ మూడు పోస్టులు
సినీ నటులు తమన్నా, సమంత, రకుల్‌కు ఓట్లు కల్పించినట్లుగా ప్రచారం
ముగ్గురు హీరోయిన్లకు ఒకే ఇంటి నెంబర్
రకుల్, తమన్నాలకు ఒకే ఎపిక్ నెంబర్
స్పందించిన జిల్లా ఎన్నికల అధికారి
సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన జీహెచ్ఎంసీ విజిలెన్స్
ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాపై ఫుల్ ఫోకస్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bypoll) నేపథ్యంలో బుధవారం సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన మూడు పోస్టులు దుమారం రేపాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఓటరు జాబితాలో భారీగా ఫేక్ ఓట్లు నమోదు చేశారంటూ పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ సమయంలో ముగ్గురు హిరోయిన్లకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు చేసి, వారికి ఎపిక్ కార్డులను కూడా జారీ చేసినట్లు సోషల్ మీడియా పోస్టులు ప్రత్యక్ష కావడంతో జిల్లా ఎన్నికల అధికారి సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఫేక్ ఓట్ల వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్లటం, మళ్లీ సోషల్ మీడియాలో ఓట్లకు సంబంధించిన పోస్టింగులు పెట్టడం ఓటర్లను ఒకింత అయోమయానికి, ఆందోళనకు గురి చేసే అవకాశమున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ గుర్తించారు. ముఖ్యంగా సినీ హిరోయిన్లు సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్‌లకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటరు జాబితాలో ఓటు హక్కు కల్పించినట్లు పోస్టులు పెట్టిననట్లు జిల్లా ఎన్నికల విభాగం గుర్తించింది. పైగా ఆ ముగ్గురు హీరోయిన్ల చిరునామాకు ఓ రాజకీయ నేత ఇంటి నెంబర్‌ను జతపర్చినట్టుగా ఉండడం చర్చనీయాంశమైంది. హీరోయిన్లకు ఎపిక్ కార్డులు జారీ చేశారంటూ ప్రచారం చేసిన ఇవే పోస్టింగ్‌లలో రకుల్, సమంత, తమన్నాలకు జారీ చేసిన ఎపిక్ కార్డుల నెంబర్ల ఒకేలా ఉండటంతో ఇది ఫేక్ అని ఎన్నికల సంఘం గుర్తించింది.

ముగ్గురు హీరోయిన్లకు 8-2-120/4 అనే ఒకే ఇంటి నెంబర్‌ను ఈ పోస్టులో కేటాయించారు. ఎపిక్ నెంబర్లను మాత్రం రకుల్‌కు డబ్ల్యుకేహెచ్ 4450729గా, సమంతకు డబ్ల్యుకేహెచ్ 4450946గా, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ కు కేటాయించిన ఎపిక్ నెంబర్‌నే ఈ పోస్టుల్లో క్రియేట్ చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఎలక్షన్ వింగ్ అధికారులు జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలతో జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఈ మూడు పోస్టులై విచారణ జరిపించి, ఈ పోస్టులను పెట్టిన వారిని గుర్తించాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డితో ప్రస్తావించగా, దుమారం రేపిన ఆ మూడు పోస్టులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని, త్వరలోనే పోస్టింగ్ లు పెట్టిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్ లను పెట్టిన వారిని త్వరలోనే గుర్తిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

Read Also- Gujarat Politics: ఒక్క సీఎం మినహా.. మూకుమ్మడిగా రాజీనామా చేసిన గుజరాత్ మంత్రులు!.. ఎందుకో తెలుసా?

ఇకపై ఫుల్ ఫోకస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్ (ఎంసీసీ)ని ఉల్లంఘిస్తూ ఏకంగా ముగ్గురు సినిమా హిరోయిన్లపై ఫేక్ పోస్టింగ్ లు పెట్టడంతో స్పందించిన జిల్లా ఎన్నికల వింగ్, జీహెచ్ఎంసీ ఎలక్షన్ వింగ్ అధికారులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ఇలాంటి పోస్టుల మళ్లీ రాకుండా చర్యలు చేపట్టారు. ఇందుకు గాను సోషల్ మీడియాపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గానీ, వారి పార్టీ నేతలు గానీ ఇతరులను అవమాన పరిచేలా, మనోభావాలను కించపరిచేలా, మతం పేరిట రెచ్చగోట్టేలా, ఓటర్లను అయోమయానికి గురి చేసేలా పోస్టింగ్ లు పెట్టిన వారిపై నిఘా పెట్టారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ దశలో ఉంది. ఈ నెల 21న నామినేషన్ల స్వీకరణ ముగిసిన, 22న నామినేషన్ల పరిశీలన జరిగిన తర్వాత ఎన్నిక ప్రచారంలో మరింత వేడి రాజుకునే అవకాశమున్నట్లు ఎలక్షన్ వింగ్ గుర్తించింది. ఇలాంటి పోస్టులకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తుంది. సోషల్ మీడియాలో ప్రజలను, ఓటర్లను తప్పుదోవ పట్టించేలా, అయోమయానికి గురి చేసేలా పోస్టింగ్ పెట్టిన వారిపై కఠినంగా వ్యవహారించేందుకు జిల్లా ఎలక్షన్ వింగ్ సిద్దమైనట్లు తెలిసింది. సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్టును ఎంసీఎంసీ కమిటీ పర్యవేక్షిస్తుందని, ఫేక్ పోస్టులు పెట్టే వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

Read Also- Jatadhara Movie: కసబ్ గారూ.. ‘ఓజీ’ సినిమా చూశారా! క్లాసిక్ హారర్ సెటప్‌తో ‘జటాధర’ ప్రమోషన్స్ షురూ!

Just In

01

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?