Threat from Real Estate Mafia (imagcredit:swetcha)
తెలంగాణ

Threat from Real Estate Mafia: మానవ హక్కుల కమిషన్‌కు వృద్ధుడు ఫిర్యాదు.. కాపాడండి అంటూ ఆవేదన

Threat from Real Estate Mafia: రియల్​ఎస్టేట్ మాఫియా(Real Estate Mafia) నుంచి తనకు, తన కుమారునికి ప్రాణహాని ఉందంటూ ఓ వృద్ధుడు మానవ హక్కుల కమిషన్(Human Rights Commission)​ కు ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీస్​స్టేషన్ తోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవ్వరూ పట్టించుకోవటం లేదని అందులో పేర్కొన్నాడు. బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మునుగోడు(Munugodu) మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మద్ది సాయిలుకి తండ్రి నుంచి వారసత్వంగా 414, 416, 417, 418, 422 సర్వే నెంబర్లలో కొంత భూమి సంక్రమించింది. కాగా, ఈ భూమికి సంబంధించి కొన్నిరోజులుగా కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు నడుస్తున్నాయి.

ఒడిషా రాష్ట్ర నెంబర్ ప్లేట్లు ఉన్న కార్లలో

ప్రస్తుతం ఈ వివాదం జిల్లా కలెక్టర్​వద్ద విచారణలో ఉంది. కాగా, దుబ్బాక మహేందర్ రెడ్డి(Mhendar Reddy), బద్దం గోపాల్ రెడ్డి(Gopall Reddy) మరికొందరు తమ కుటుంబానికి చెందిన కొంతమంది నుంచి వివాదంలో ఉన్న భూమిలో కొంత భాగాన్ని తక్కువ రేట్లకు కొన్నట్టు మద్ది సాయిలు మానవ హక్కుల కమిషన్(Human Rights Commission) కు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. దీనిని అడ్డం పెట్టుకుని ఒడిషా(Odisha) రాష్ట్ర నెంబర్ ప్లేట్లు ఉన్న కార్లలో కొంతమంది రౌడీలను మారణాయుధాలతో తీసుకువచ్చి తన భూముల(Land)ను దున్నే ప్రయత్నం చేశారని పేర్కొన్నాడు. దీనిని అడ్డుకోగా తనను, తన కుమారుడు మద్ది సైదులు(saidulu)ను చంపేస్తామని బెదిరించినట్టు తెలిపాడు.

Also Read: Rath Yatra: భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగు.. విషాదం

నల్గొండ జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు

కలెక్టర్ వద్ద విచారణలో ఉన్న భూములను ఎలా కొంటారని ప్రశ్నిస్తే బతకాలని లేదా అంటూ భయపెట్టారని పేర్కొన్నాడు. దీనిపై మునుగోడు పోలీసుల(Munugodu Police)కు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. పోలీసులు తనను, తన కుమారున్ని స్టేషన్‌కు తీసుకెళ్లారని, తమను బెదిరించిన వారిని మాత్రం పంపించి వేశారని తెలిపారు. దాంతో నల్గొండ జిల్లా ఎస్పీ(Nalgonda SP)కి సైతం ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఎస్పీ ఆఫీస్‌లో ఫిర్యాదు చేసి వస్తున్నపుడు కూడా ఒడిషా రిజిస్ట్రేషన్​నెంబర్‌తో ఉన్న కారులో తమను వెంబడించారని వివరించారు. తనకు, తన కుమారునికి ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించటంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించారు.

Also Read: Temples: ఆలయాలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

 

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు