ED Raids (imagecredit:twitter)
తెలంగాణ

ED Raids: దూకుడు పెంచిన ఈడీ.. కార్ల స్మగ్లర్ ఇళ్లు ఆఫీసుల్లో సోదాలు

ED Raids: కారు స్మగ్లర్ బషారత్ అహమద్ ఖాన్ కేసులో ఎన్​ ఫోర్స్ మెంట్​ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చింది. ఈ వ్యవహారంలో బషారత్ అహమద్ ఖాన్(Basharat Ahmed Khan)​ ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా ఇప్పటికే ఈడీ అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంట్లో శుక్రవారం ఈడీ అధికారులు బషారత్ అహమద్ ఖాన్​ ఇల్లుతోపాటు అతను నడుపుతున్న కార్ల షోరూం, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఈ స్మగ్లర్​ నుంచే ల్యాండ్​ క్రూయిజర్ కారు కొన్నట్టుగా కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపణలు చేసిన 48గంటల్లోనే ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టటం. ఇప్పటికే ఈ ఫార్మలా కారు రేసు…ఫోన్​ ట్యాపింగ్ బాగోతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్​ కు ఈ తాజా వ్యవహారం కూడా తలనొప్పిగా మారే అవకాశముందని పోలీసు వర్గాలే అంటున్నాయి. ఆయనతోపాటు బషారత్​ అహమద్ ఖాన్​ స్మగుల్ చేసి తీసుకొచ్చిన కార్లను కొన్న మరికొందరు రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు కూడా చిక్కుల్లో పడక తప్పదని వ్యాఖ్యానిస్తున్నాయి.

కారు పార్టీ స్మగ్లింగ్ చేసి..

జూబ్లీహిల్స్ నివాసి బషారత్​ అహమద్​ ఖాన్​ గచ్చిబౌలిలో ఎస్కే కార్ లాంజ్ పేర వ్యాపారం చేస్తున్నాడు. తేలికగా కోట్లు సంపాదించేందుకు అమెరికా, జపాన్​ దేశాల నుంచి అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొని దుబాయ్​, శ్రీలంక మీదుగా భారత్ కు చేరుస్తూ వచ్చాడు. ఇక్కడకు తీసుకు రావటానికి ముందు శ్రీలంకలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లను రైట్​ హ్యాండ్​ డ్రైవ్ గా మాడిఫై చేయించేవాడు. ఇలా స్మగుల్ చేసి తెచ్చిన కార్లను అహమదాబాద్​ లోని తన ఫార్మ్ హౌస్​ లో పెట్టి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సెలబ్రెటీలకు విక్రయిస్తూ వచ్చాడు. ఇలా అమ్మిన ఓ కారునే కేటీఆర్​ ఉపయోగిస్తున్నట్టుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రెండో రోజుల క్రితం మీడియాతో చెప్పారు. కారు పార్టీ స్మగ్లింగ్ చేసిన కార్ల మీద నడుస్తోందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ఆరోపణలు చేసిన 48గంటల్లో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. నిజానికి గుజరాత్ డైరెక్టరేట్ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్​ఐ) అధికారులు కార్ల స్మగ్లింగ్​ కేసులో బషారత్ అహమద్ ఖాన్​ ను అరెస్ట్​ చేసిన కొన్ని రోజులకే హైదరాబాద్ ఈడీ అధికారులు ఫెమా చట్టం ప్రకారం అతనిపై కేసులు నమోదు చేశారు.

UP Madrassa: యూపీలో ఘోరం.. 40 మంది బాలికలను.. బాత్రూమ్‌లో బంధించి..

రాజకీయ వర్గాల్లో..

కాగా, ఈడీ అధికారులు తాజాగా జరిపిన దాడులు రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారాయి. బషారత్ అహమద్​ ఖాన్​ నుంచి కొన్న ల్యాండ్ క్రూయిజ్ కారు ప్రస్తుతం కేటీఆర్​ కాన్వాయ్ లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ కారు ఎట్ హోం హాస్పిటాలిటీ సర్వీస్​ పేర రిజిష్టర్ అయి ఉన్నట్టు డీఆర్​ఐ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ సంస్థ వివరాలు సేకరిస్తున్నారు. ఛైర్మన్ ఎవరు? డైరెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు? అన్న సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఇక, కారు కొన్నందుకు చెల్లింపులు ఎలా జరిపారు? పూర్తిగా నగదు రూపంలో చెల్లించారా? అన్న అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక, కార్లను స్మగ్లింగ్ చేసిన వ్యవహారంలో బషారత్ అహమద్ ఖాన్​ ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా ఆరోపణలు ఉన్న క్రమంలో వాటిపై కూడా విచారణ చేస్తున్నారు.

Also Read: Gadwal Farmers: గద్వాల జిల్లాలో పత్తి రైతుల కష్టాలు.. అధిక వర్షాలతో ఎర్రబారుతున్న పంటలు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?